breaking news
mandsour
-
బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
భోపాల్ : ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచార ఘటనలో మధ్యప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. జాన్ 26న మంద్‌సౌర్‌లో పాఠశాల వద్ద తండ్రికోసం ఎదురుచుస్తున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను అవహరించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందితులు ఇర్ఫాన్ (20), ఆసీఫ్ (24)లకు ఉరిశిక్షను విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. పన్నిండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్షను విధిస్తూ ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం నిందింతులను మరణశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి నిషా గుప్తా తీర్పును వెలువరించారు. మంద్‌సౌర్‌లో జరిగిన ఈ ఘటనపై కోర్టు 37 మందికి సాక్షులతో సహా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించింది. బాలికను అపహరించిన నిందితులు అత్యాచారం చేసి.. ఆమె చనిపోయిందని భావించిం నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను గమణించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. బాలిక శరీరంపై బలమైన పంటిగాట్లు ఉన్నాయని, ఆమె ప్రైవేటు అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాపంగా ప్రతిపక్షాలతో సహా, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఈ భూమ్మీద నివశించే హక్కులేదని, వారికి మరణశిక్షే సరైనదని అన్నారు. కాగా కేవలం రెండు నెలల్లోనే కోర్టు తీర్పును వెలువరించడం విశేషం. -
24 గంటలు తిరక్కముందే సీఎం ట్విస్ట్
భోపాల్: రాష్ట్రంలో రైతులు ఆందోళన విరమించి, శాంతి నెలకొనేవరకు దీక్ష కొనసాగిస్తానన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్యంగా దీక్ష విరమించారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష ప్రారంభించి సరిగ్గా 24 గంటలు కూడా గడవకముందే ఆయన దీక్ష విరమణ ప్రకటన చేయడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం రైతు సంఘాల నేతలు, రాష్ట్ర మంత్రులు కలిసి సీఎంకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. నిరాహార దీక్ష చేయవద్దని రైతులు కోరినందునే తానీ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం శివరాజ్ మీడియాకు తెలిపారు. రుణాల మాఫీ, కనీస మద్దతుధర అంశాలపై రైతులు ఆందోళన చేయడం, మాంద్సౌర్లో ఐదుగురు రైతులను పోలీసులు కాల్చిచంపడంతో మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రహింస చెలరేగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతిని కాంక్షిస్తూ సీఎం శివరాజ్ శనివారం నుంచి నిరాహారదీక్షకు దిగారు. అయితే మాంద్సౌర్లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు సీఎంను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ మేరకు సీఎం నిమ్మరసం సేవించారు. కాగా, రైతులపై కాల్పులు జరిపినవాని కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు.