breaking news
mancherial Govt hospital
-
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్‌ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు. ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రసవ వేదన..
* మొన్న గర్భిణి.. నిన్న లోకం చూడని పసిగుడ్డు * మృత్యువాత పడుతున్న వైనం * మహిళా వైద్యుల కొరతతో గర్భిణుల అవస్థలు * చోద్యం చూస్తున్న అధికారులు లోకం చూడకుండానే.. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన గట్టు సంధ్య 9 నెలల గర్భిణి. డిసెంబర్ 30వ తేదీన నొప్పులు తీవ్రం కావడంతో భర్త రాజ్‌కుమార్, తన సోదరి లావణ్యతో కలిసి ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రసూతి విభాగంలో (పీపీ యూనిట్ వైద్యురాలు) డాక్టర్ పద్మజ అందుబాటులో ఉండటంతో ఆమెను పరీక్షించి భయమేమీ లేదని చెప్పింది. 31వ తేదీ బుధవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో నొప్పులు ఎక్కువ కావడంతో రాత్రి పూల వైద్యురాలు రాలేదు. అయితే.. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆపరేషన్ చేయాలని ఇందుకు రూ.4 వేలు అవుతాయని చెప్పడంతో చేసేది లేక ఓ కవర్లో డబ్బులు పెట్టి ప్రసూతి సిబ్బందికి ఇచ్చారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గర్భసంచి పగిలిపోవడంతో శిశువు మృతి చెంది సంధ్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. చివరకు వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఆ బిడ్డ చనిపోయింది. మంచిర్యాల టౌన్ : మాతా, శిశు మరణాలను అరికట్టాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. అధికారుల, వైద్యుల్లో మాత్రం ఆ విధంగా మార్పు రావడం లేదు. మంచిర్యాల ఆస్పత్రి తూర్పు జిల్లాకే ఏకైక దిక్కు. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని 26 మండలాలకు ఈ ఆస్పత్రేశరణ్యం. జిల్లాకొచ్చిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ మంచిర్యాలను జిల్లా చేస్తామంటూనే ఉన్నారు. అలాంటి పెద్ద ఆస్పత్రుల్లో వైద్యం మిథ్యగా మా రింది. కాసులు ఇచ్చుకోనిదే రోగులకు వైద్యం అందని దుస్థితి దాపురించింది. ఓ వైపు ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతూనే.. మరోవైపు రోగుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో ఈ దయనీయ పరిస్థితి ఉంది. ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నా.. వైద్యం అందించలేక పొరుగు జిల్లాలకు రెఫర్ చేస్తున్నారు. తూర్పు జిల్లా ప్రాంతంలోని ప్రజలకు ఏ రోగమొచ్చినా.. కాన్పు కోసమైనా మంచిర్యాలలోని వంద పడకల ఆస్పత్రికే వస్తుంటారు. కాన్పు కోసం వచ్చిన మహిళలు నిత్యం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వైద్యుల కొరత.. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి వి భాగంలో గతంలో ఇద్దరు మహిళా వైద్య నిపుణు లు ఉండేవారు. జ్యోతి అనే వైద్యురాలు ప్రసవానికి, ఆపరేషన్‌కు ఓ రేటు నిర్ణయించి పనిచేస్తుం డటంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమెపై వచ్చిన ఒత్తిడి మేరకు డాక్టర్ జ్యో తి సెలవులోకి వెళ్లారు. ఆమె భర్త డాక్టర్ సదానందం అందుబాటులో ఉన్నా చికిత్స అందించడం లో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు పద్మజ అనే వైద్యురాలిని కుందారం పీహెచ్సీ నుంచి డి ప్యుటేషన్‌పై మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి పీపీ యూనిట్‌కు రప్పించారు. ప్రస్తుతం ఆమె గర్భిణులకు సేవలందిస్తున్నారు. ఈమెపైనా గతంలో పలు ఆరోపణలు ఉన్నా..చర్యలు లేకపోవడంతో తన వైఖరిలో మార్పు రాలేదు. డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. పురిట్లోనే ప్రాణాలు పోయేలా.. ఆస్పత్రిలోని పీపీ యూనిట్లో ఉన్న జనరల్ ఫి జిషియన్ డాక్టర్ పద్మజ మహిళలకు చికిత్స అం దిస్తున్నారు. ప్రసూతి విభాగంలో నార్మల్ డెలివ రీ, ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి వ చ్చే గర్భిణులు సరైన వైద్యం అందడం ఏమో కా నీ చేతులు తడపనిదే పని జరగడం లేదు. నార్మ ల్ నుంచి ఆపరేషన్ ఏది కావాలన్నా రూ.4 వేల కు పైగా డబ్బులు ఇవ్వనిదే థియేటర్లోకి అడు గు పెట్టరు. మూడు నెలల్లో దాదాపు 100 మందికి పైగా గర్భిణులను గోదావరిఖని, కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు రికార్డులు కూడా ఉన్నాయి. పర్యవేక్షణ కరువు.. వైద్యుల నిర్లక్ష్యంతో నిరుపేద రోగులు ఇబ్బందు ల పాలవుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఆస్ప త్రి దూరంగా ఉండటం, ఉన్నతాధికారులు త నిఖీలకు రాకపోవడంతో సేవల విషయంలో వైద్యులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. వైద్యురాలు లేక గర్భిణి మృతి... జైపూర్ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన అంగడి రజిత (28) అనే గర్భిణి తన భర్త బానయ్యతో మంచిర్యాల ఆస్పత్రికి గత అక్టోబర్‌లో ప్రసవం కోసం వచ్చింది. వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్ రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ వెళ్లాలని సూచించారు. వరంగల్ వెళ్తుండగా మార్గమధ్య లో రజిత మృత్యువాత పడింది. ఇలాంటి ఘటన లు గతంలోనూ చాలా జరిగాయి. అయినా.. పట్టించుకునే వారే లేరు.