breaking news
management education department
-
ఇందూరు సైన్యం సిద్ధం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్ధి రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆయా నియోజకవర్గాలకు ఈవీఎం లు, వీవీ ప్యాట్లను తరలించారు. పోలింగ్‌కు ఎనిమిది రోజులే ఉన్నందున సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీ గా ప్రిసైడింగ్(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల(ఏపీవో)తో పా టు అదనపు పోలింగ్ అధికారులను కేటాయించారు. మొత్తం అధికారులు, సిబ్బంది కలిపి 6,880 మంది పోలిం గ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. జిల్లాలో మొత్తం 1,433 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్‌కు ఒక రు చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండనున్నా రు. ప్రస్తుతం 20 శాతం అదనంగా కలుపుకుని 1,720 మంది ప్రిసైడింగ్, 1720 మం ది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియ మించారు. ఇతర ప్రిసైడింగ్ అధికారులు 20 శా తం అదనంగా కలుపుకుని 3,440 మంది నియామకమయ్యారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 272 పోలింగ్ కేంద్రాలుండగా, 326 మంది చొప్పున ప్రిసైడింగ్, అంతే చొప్పున అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ఇతర ప్రిసైడింగ్ అధికారులు 653 మంది ఉన్నా రు. అత్యల్పంగా ఆర్మూర్‌లో 211 పోలింగ్ కేం ద్రాలకు 253 మంది చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండగా, ఇతర ప్రిసైడింగ్ అధికారులు 506 మంది ఉన్నారు. ఉత్తర్వుల కాపీలు జారీ.. ఎన్నికల నిర్వహణకు అన్నిశాఖల ఉద్యోగులు, టీచర్లను పోలింగ్ విధుల్లోకి తీసుకున్నారు. ఎవరెక్కడ విధులు నిర్వర్తించాలో ఆర్డర్ కాపీలను కలె క్టర్ రామ్మోహన్ రావు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఇది వరకే మొదటి దశ శిక్షణ పూర్తి చేయగా, మరోసారి ఆయా నియోజకవర్గాల వారీగా ఈనెల 28, 29 తేదీల్లో శిక్షణ ఇస్తున్నారు. 30వ తేదీన ఇతర ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు∙వారే పరిష్కరించుకునే విధంగా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్తర్వులు తీసుకున్న ప్రతి అధికారి, ఉద్యోగి హాజరు కావాలని, గైర్జారైతే చర్యలుం టాయని కలెక్టర్ హెచ్చరించారు. -
ఎన్నికల వేళ..
ఈనెల 27 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు బిజీ.. బిజీగా అధికారులు నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : ఓ వైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు పదవ తరగతి పరీక్షల నిర్వహణ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. అయితే ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది వరకే వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాల డెరైక్టర్ మన్మద్‌రెడ్డి విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 40,627 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. అందులో 17,745 మంది బాలికలు, 18,394 మంది బాలురు ఉన్నారు. ప్రైవేట్‌లో 4,488 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లాలో మొత్తం 193 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఏప్రిల్ 25 వర కు కొనసాగుతాయి. పరీక్షల సమయంలో విద్యాశాఖకు చెందిన సిబ్బందికి ఎన్నికల డ్యూటీ విధించడం సమస్యగా మారిందని అధికారు లు పేర్కొంటున్నారు. అయితే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లను ఈసారి పరీక్షలను వినియోగిస్తున్నారు. పరీక్షలకు 3వేల మంది సిబ్బంది అవసరం ఉండగా విద్యాశాఖకు చెందిన వారిని పూర్తి స్థాయిలో కేటాయిం చారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుం టున్నారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెంటల్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయ్యింది. పరీక్షలు మరో నలుగు రోజులే ఉండడంతో విద్యాశాఖ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈసారి పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే కారణాలు తెలుసుకోవడం, సంతృప్తిగా ఉంటేనే అనుమతించడం లాంటి విధానాలు చేపడుతున్నారు. ఈ క్రమం లో విద్యార్థులకు అసౌకర్యం కలుగ కుండా చూడాలని అధికారులు భావి స్తున్నారు.