మల్లికార్జున ముత్యాకు మూడింది.. వైరల్ వీడియోతో ‘అప్పాజీ’పై పోక్సో కేసు
బెంగళూరు: తనను తాను ‘నడిచే దేవుడు’గా ప్రచారం చేసుకుంటున్న మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాలల రక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గోగి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదనంగా బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. అయితే, ముత్యా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది.మఠాధిపతి నేపథ్యంమల్లికార్జున ముత్యా కర్ణాటక యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠం అధిపతి. ఆయనను స్థానికంగా ‘నడిచే దేవుడు’గా కొలుస్తారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. మఠం ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.సంఘటన వివరాలుఫిబ్రవరి 19న మహల్ రోజా మఠంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఓ మైనర్ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు మఠానికి వచ్చారు. మఠంలో అందరూ చూస్తుండగానే ముత్యా బాలికను ఎత్తుకోవడం, ఆమె శరీరాన్ని తాకడం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదం చెలరేగింది.పోలీసు చర్యలువీడియో ఆధారంగా పోలీసులు చిన్నారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె తల్లిదండ్రులను కూడా విచారించారు. మఠానికి నోటీసులు జారీ చేసి, ముత్యా విచారణాధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. మఠంలో ముత్యా అనుచరులు, భక్తులు సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. ‘కమిషన్ వీడియోను సరిగా పరిశీలించకుండా తొందరపడి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అధికారులను ఆదేశించింది. 48 గంటల్లో ఎఫ్ఐఆర్ను ఉపసంహరించకపోతే, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ముందు నిరసన చేపడతాం’ అని యాదగిరి సీఎంసీ మాజీ చైర్పర్సన్ లలితా అన్పూర్ మీడియాకు తెలిపారు.మల్లికార్జున ముత్యా ఒక స్వయంఘోషిత దేవుడు. ఆయనకు భక్తులలో గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు, కేసు కారణంగా పెద్ద వివాదం చెలరేగింది. ఎఫ్ఐఆర్ నిజమా, వీడియో ఎడిట్ చేసిందా అన్నది కోర్టు విచారణలో స్పష్టత రావాల్సి ఉంది.