breaking news
malli ravi
-
రాహుల్ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఈనెల 12న సత్యాగ్రహ దీక్ష చేస్తామన్నారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, మల్లు రవి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇమేజ్ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది. మోదీలపై మాట్లాడినందుకు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపించారు. భద్రతను సైతం తగ్గించారు. హైకోర్టుకు వెళ్లినా స్టే ఇవ్వకుండా చూశారు. సత్యాగ్రహ దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు హాజరు కావాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
‘టీఆర్ఎస్ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు’
హైదరాబాద్: కాంట్రాక్టు లెక్చరర్లు టీఆర్ఎస్ ఉచ్చులో పడ్డారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారి క్రమబద్దీకరణకు విధివిధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టామంటూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు ఆ పార్టీ కార్యాలయాన్ని, సెక్రటేరియట్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ఫై బురద జల్లేందుకే ముఖ్యమంత్రి ఈ ఆందోళన చేయిస్తున్నారని, పోలీసులు దగ్గరుండి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనకు గతంలో కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి బేసిక్ పే పెంచాలని డిమాండ్ చేస్తున్నామని పార్టీ నేత కత్తి వెంకటస్వామి అన్నారు. కేసుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కేసులు వేయలేదు.. వ్యక్తిగతంగా ఎవరైనా వేసివుంటే పార్టీ బాధ్యత కాదు అని స్పష్టం చేశారు.