శ్రీలంక అధ్యక్షుడితో ఈవో భేటీ
శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దంపతులతో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు, పక్కన జేఈవో శ్రీనివాసరాజు
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బేటీ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన తర్వాత మర్యాదపూర్వకంగా సిరిసేను కలిశారు.
తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని, ఆలయ విశిష్టతను, భక్తులకు టీటీడీ కల్పించే సౌకర్యాలను సిరిసేనకు వివరించారు. ఆయన చాలా ఆసక్తిగా విన్నారు. బుధవారం సుప్రభాత సేవలో సిరిసేన బృందం స్వామివారిని దర్శించుకోనుంది. అంతకుముందు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా సిరిసేనను కలసి స్వాగతం పలికారు.