breaking news
main door
-
మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడు
హైదరాబాద్ : అసెంబ్లీ ద్వారాన్ని పగులగొట్టిన ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. డీసీపీ కమలాసన్ రెడ్డి బుధవారం ఘటనాస్థలాన్ని సందర్శించి అసెంబ్లీ సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వరంగల్ జిల్లాకు చెందిన అశోక్‌రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు అతడు మెయిన్ గేట్ దూకి లోపలకు వచ్చాడని చెప్పారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 6 వద్ద తలుపులను పగలగొట్టాడని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ద్వారాన్ని బయట వ్యక్తులు బద్దలు కొట్టడం అసెంబ్లీకి భద్రత లేదనటానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏపీ అసెంబ్లీ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిన వ్యక్తి
హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో మరోసారి భద్రత వైఫల్యం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డాడా లేక మానసిక స్థితి సరిగ్గా లేక ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)