-
పనులు సజావుగా పూర్తవుతాయి
నవంబర్ 21 నుంచి 27 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) పని చేసీ చేసీ అలసిపోయిన శరీరానికీ, మనస్సుకీ కొంత విశ్రాంతి అవసరం. వీలయితే మీరు కొంత విశ్రాంతి తీసుకోండి. కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్టు లేదా ఉద్యోగావకాశం రావచ్చు. కొన్ని రకాల ప్రలోభాలకి, ఆకర్షణలకి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. జరగబోయే దాని గురించి ఊహించుకోవడం అంత మంచిది కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ టారస్ (ఏప్రిల్ 21-మే 20) భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మీరు వెతుకుతున్న ప్రేమను పొందుతారు. మీ లక్ష్యాలు దాదాపు పూర్తవుతాయి. ఆడుతూ పాడుతూ హాయిగా పని చేసుకోండి. మీరేమిటన్నది మీ పనే చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ ఒడుదొడుకులను ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ జెమిని (మే 21-జూన్ 21) అనుకున్న పనులన్నింటినీ సజావుగా, సక్రమంగా పూర్తి చేస్తారు. గత నెలరోజులుగా మీ మనసులో రూపుదిద్దుకుంటున్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. మీ డబ్బును మదుపు చేసేందుకు మరిన్ని మంచి మార్గాలు అన్వేషించండి. ప్రేమ విషయంలో కొంత వైఫల్యం ఎదురైనప్పటికీ మీలో ఉన్న ఆనందాన్ని, చురుకుదనాన్ని పోగొట్టుకోకండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ క్యాన్సర్ (జూన్22-జూలై 23) విజయాల బాటలో నడుస్తారు. మీరు సాధించిన విజయాలను చూసి మీరే గర్విస్తారు. మీ పనితనాన్ని చూసి, చాలా మంది మీ పట్ల మొగ్గ చూపుతారు. అయితే మీ విజయాలను చూసి గర్వించకుండా, అహంకరించకుండా, సమతుల్యతను పాటిస్తూ, జీవితంలో మరింత ఆనందాన్ని నింపుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ అసలైన శిక్షణ ఇప్పుడే ఆరంభమైందని గుర్తించండి. మొదట్లో కొంత అపరిపక్వంగా ఉన్నా, రానురానూ పరిణతి సాధిస్తారు. నేర్చుకోవడం పట్ల దృష్టి పెడితే సులువుగా చేసుకోవచ్చు. ఆఫీసులో లేదా పనిప్రదేశంలో ఇద్దరు విభిన్న మనస్తత్వాలున్న అధికారులతో పని చేయవలసి రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే గెలుపు మీదే. కలిసొచ్చే రంగు: వంకాయరంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్త పనులు ప్రారంభించడం, కొత్త మార్పులు చోటు చేసుకోవడం జరగవచ్చు ఈ వారంలో. ఇష్టపడ్డవారితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. వారు మీ నుంచి విడిపోతారేమోనన్న ఆలోచనే మీకు చేదుగా అనిపిస్తుంటుంది. అయితే, మీకంత ఇబ్బంది ఏమీ రాదు. పేదల పట్ల కొంచెం ఉదారంగా ఉండండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని చికాకులు చోటు చేసుకోవచ్చు. అయితే వాటిగురించే ఆలోచిస్తూ కుంగిపోవద్దు. శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరితోనైనా అనైతిక బంధంలో ఉంటే వెంటనే తెంచేసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరతారు. పని మీద దృష్టి పెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: వెండిరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) వృత్తిపరంగా కొత్త మార్పులు చోటు చేసుకోవచ్చు. బదిలీ లేదా ఉద్యోగంలో స్థాన మార్పు విషయమై కొన్ని వార్తలు వింటారు. అంతా బాగుంటుందనే ఊహించండి. ప్రేమబంధం మరింత బలపడుతుంది. ఒక దూరప్రయాణం ఉండచ్చు. సృజనాత్మకంగా ఆలోచించండి, కళాత్మకంగా పని చేయండి. కలిసొచ్చే రంగు: బూడిదరంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకంటూ గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే శృంగారం, ప్రేమ కన్నా కెరీరే ప్రధానమని గుర్తించడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమరంగు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లను అధిగమించడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, తీసుకున్న నిర్ణయాలను, చేసిన ఆలోచనలను వెంటనే అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరులు వాటిని తమవని చెప్పుకునే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: ఇటికరాయి రంగు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చేరంగు: ఆలివ్ గ్రీన్ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) వివిధ కారణాల వల్ల మీరు లోగడ దరఖాస్తు చేసిన దానికే తిరిగి ప్రయత్నించవలసి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయి మళ్లీ ప్రయత్నించి సాధించుకోవలసి వస్తుంది. వ్యాపారంలో కూడా రెండవమారు ప్రయత్నమే ఫలించే అవకాశం కనిపిస్తోంది. కాలగ్రహ ఫలితమే తప్ప మీ దోషం కాదు ఈ స్థితికి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఒకప్పుడు నమ్మకంగా చేసిన పనులన్నీ ఇప్పుడు రాతకోతల పరిస్థితికి రావచ్చు. అప్పట్లో నోటి మాట మీద తీసుకుని ఎంతెంతో చెల్లించినప్పటికీ నేడు కాగితం కావలసిందే అనే ఒత్తిడి మీపై రావచ్చు. కాగితం మీది సంతకం వజ్రాయుధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి అక్షరాన్ని ఆలోచించి రాయండి. పెద్దల్ని సంప్రదించి మాత్రమే పత్రాల మీద సంతకాన్ని చేయండి. జెమిని(మే 21-జూన్ 21) ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నించిన అన్ని కార్యక్రమాలూ విజయవంతమై సుఖసంతోషాలతో గడుపుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలత ఉన్నా ఇక్కడ పరిష్కరించుకోవలసిన సమస్య ఉన్నందువల్ల ఈ మాసంలో విదేశీ ప్రయాణం గురించి కొంత ఆలోచించ వలసిందే! దంపతులకి ఉద్యోగరీత్యా కొంతకాలం ఎడబాటు ఉండవచ్చు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ దంపతుల్లో ఒకరికి మానసికారోగ్యం బాగుండకపోవచ్చు. సంతానానికి సంబంధించి సమస్య కారణంగా చింతతో ఉంటారు. జరిగే వ్యతిరేకతంటూ ఏమీ లేకున్నా, మానసికంగా దృఢంగా ఉండలేకపోవచ్చు. దీనికితోడు ఆర్థికంగా వ్యయం అవుతూ ధనం ఎలా వచ్చిందో అలా వెళ్లిపోతూ ఉండచ్చు కూడా. ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకోవడం మంచిది. లియో (జూలై 24-ఆగస్టు 23) మీ దంపతులు అందరికీ అన్యోన్యంగా కనిపిస్తున్నప్పటి కీ అంత సుఖంగా ఉండ (లే)కపోవచ్చు. దానికి ఆర్థికమైన విషయాల్లో ఒకరికొకరికి అవగాహనా సమన్వయమూ సామరస్యమూ లేకపోవడమే కారణం అనిపిస్తోంది. జరిగిందాన్ని మరచి ఇప్పటికైనా ఆర్థికమైన విషయాల్లో గుంభనని వీడితే దాంపత్యం సుఖమయమై సంతోషమంటే ఏమిటో అర్థమౌతుంది. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన చిత్తవృత్తికి భిన్నంగా కోపం కలిగించే సంఘటనలు మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. దాని గురించే ఆలోచిస్తుండే కారణంగా ఉద్యోగంలో కూడా అధికారులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. మీతో విరోధించిన వారికి మీరే స్వయంగా తెలియజేసుకుని పరిస్థితిని చక్కబరుచుకుంటే ఔషధసేవ తప్పుతుంది. మనసూ బుద్ధీ ఆరోగ్యవంతంగా ఉంటాయి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఒక ఆలోచనతో మీరుంటే, దాన్ని మీచుట్టూ చేరిన బంధుమిత్రులందరూ తమ సూచనలని చెప్పి వాళ్ల అభిప్రాయానికి మిమ్మల్ని దాసోహపడేలా చేసి ఉంటారు లోగడ. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితిలో ఉన్న మీకు ఎవరు చెప్పినా వినే స్థితి ఉండకపోవచ్చు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుండవచ్చునేమో! స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) అకస్మాత్తుగా వచ్చిన సమస్య మిమ్మల్ని కుంగదీస్తుంది. ఇది శని కారణంగా జరుగుతున్న స్థితి మాత్రమే. మానసిక ఆందోళన, పనుల్లో జాప్యం, ఉద్యోగంలో ఒత్తిడి అనవసర వ్యయం ఏది మాట్లాడినా మరోలా ఎదుటి వారికి అర్థం గోచరించడం... వంటివన్నీ ఈ దశలో సాధారణం అని గమనించి మీ దైనందిన జీవితాన్ని గడుపుకోండి. ఇంకొంతకాలం ఇదే స్థితి ఉండవచ్చు. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మీరు ఎవరి మాటనైనా వింటున్నట్టే ఉంటారు కానీ మీకు తోచిన రీతినే చేసే మనస్తత్వమే అధికం. మిమ్మల్ని మొగమాటపెట్టి మాట సాయం గాని, లిఖితపూర్వకమైన హామీ గాని వాగ్దానం గాని చేయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అనవసర మనోవ్యగ్రత కలగచ్చు. బురద తొక్కి కాళ్లు కడుక్కోవద్దు- సరైన తోవలో నడవండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) సంతానపరంగా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం కనిపిస్తోంది. వృథాగా ఖర్చయిన పక్షంలో దాన్ని దుర్వ్యయం అంటుంది శాస్త్రం. ఇక్కడ జరుగుతున్న వ్యయం సంతాన శ్రేయస్సు అభివృద్ధుల నిమిత్తం కాబట్టి ఇది సద్వ్యయం కిందికే వస్తుంది. ఎంతో ఖర్చయినా కూడ వ్యాధి నివారణం కాని సందర్భాలుండవచ్చునేమోగాని, ఈ ఖర్చు మాత్రం సద్వ్యయమే. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఈ రాశివారికి ఏదైనా చిన్నబుచ్చుకునే సందర్భంగాని వస్తే తిరగబడకుండా సంయమనంతో తలవంచుకోవడం లేదా ఆ ప్రదేశాన్ని మౌనంగా వీడడం మాత్రమే చేయవలసిన పని. నా తప్పు లేనప్పుడెందుకు దూరంగా తొలగిపోవాలి? అంటూ చర్చకి దిగడం కంటే ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లడం మంచిది కదా! పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కురుక్షేత్రంలో అర్జునిలా అకస్మాత్తుగా తమ ఆలోచనని నిర్వేదం నిరాశ మీదికి లగ్నం చే సి కుటుంబ సభ్యులకి కొత్త ప్రశ్న పుట్టేలా ప్రవర్తిస్తారు. గమనించుకోండి. మీ నిరాశ మొత్తం తాత్కాలికం మాత్రమే. శ్రీకృష్ణునిలా గీతోపదేశం చేసేవారెవరూ మీకు తారసపడకపోయినా కుంగిపోక మీకు మీరుగా సంయమనం పాటించడం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఓ శుభవార్త అందుతుంది
నవంబర్ 14 నుంచి 20 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఓ శుభవార్త అందుతుంది. విదేశాలనుంచి వచ్చిన ఆ అవకాశాన్ని అందుకునేముందు మీరు అందుకు తగ్గ కృషి చేయగలుగుతారా, అక్కడ ఉండగలుగుతారా లేదా అనేది తేల్చుకోండి. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. మీ అభివృద్ధి మూలంగా దిష్టి తగిలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తతో ఉండండి. కలిసొచ్చేరంగు: నలుపు టారస్ (ఏప్రిల్ 21-మే 20) జీవితంలో మీకు కావలసిన దానిని ఎంచుకునే అవకాశం కలుగుతుంది. అయితే మీరు ఎంచుకున్న ఆ మార్గం సరైనదా కాదా అనేది నిర్ధారించుకోండి. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడూ, ఉపన్యసించేటప్పుడూ భయపడితే అవకాశాలను కోల్పోతారని గ్రహించండి. అవివాహితులకు ఈ వారం వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: మీగడ తెలుపు జెమిని (మే 21-జూన్ 21) సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం వల్ల మీకా ఆనందం కలుగుతుంది. మీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. విజయాల బాటలో నడుస్తారు. పనిపట్ల పూర్తిగా దృష్టి సారించడం అవసరం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, మదుపు చేయడానికీ ఇది తగిన సమయం. సంతృప్తికరంగా లేని మీ బంధానికిముగింపు పలకడం మంచిది. కలిసొచ్చే రంగు: బంగారం రంగు క్యాన్సర్(జూన్22-జూలై 23) ఇంటిలో/ కార్యాలయంలో/ మీ జీవన సరళిలో మార్పు వస్తుంది. రాత్రి కాగానే మనసును ఏదో తెలియని భయం అవరిస్తుంది. తెల్లారేసరికి దానంతట అదే తగ్గిపోతుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేయడం మంచిది. అప్పులు, చేబదుళ్లకు దూరంగా ఉండండి. దగ్గరి బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: బూడిదరంగు కలిసిన వెండి. లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రేమ, రొమాన్స్ అనేవి మీ జీవిత లక్ష్యాలు కావు. అయినప్పటికీ మీ మనసు వాటిమీదకు మళ్లుతుంటుంది. మీ కెరీర్ ప్రధానమైన మలుపులు చోటు చేసుకుంటాయి. చదువుకు లేదా వ్యాపారంలో డబ్బుకు కటకట ఏర్పడినప్పుడు ఇతరుల సాయం అంద డం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. జీవితం మంచి మలుపు తీసుకుంటుంది. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఓ అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. నడమంత్రపు సిరి నడిచి రావచ్చు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఈ డబ్బుతో మీ కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. అయితే మీ వ్యసనాలతో పోరాటం చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రేమ పరంగా ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితంలో ప్రధానమైన మార్పు చోటు చేసుకోవచ్చు. ఇది మీ కెరీర్‌ని లేదా ఉద్యోగాన్ని లేదా జీవితాన్ని మేలిమలుపు తిప్పే మార్పు కావచ్చు. విజయాన్ని తీసుకు రావచ్చు. చుట్టుపక్కలవారు, బంధుమిత్రులు ఈ మార్పు మంచిది కాదని హితవు చెప్పవచ్చు కానీ మీరు మీ అంతరాత్మ మాట వినడం మంచిది. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) తగిన కృషి చేస్తే మీ కలలను సాకారం చేసుకోవచ్చు. బ్యాంకింగ్‌కి, వ్యాపార విస్తరణకు, మార్పు చేర్పులు తీసుకురావడానికి ఇది తగిన సమయం. స్త్రీ వల్ల అదృష్టం కలిసొచ్చే యోగం ఉంది కాబట్టి వ్యాపారంలో ఆభరణాలు, కాస్మొటిక్స్, డిజైనర్ వేర్ వంటివాటిని ప్రవేశపెట్టి, స్త్రీని భాగస్వామిగా చేర్చుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: లేత ఊదా లేదా జిల్లేడు పూల రంగు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఆకస్మికంగా కలిసొచ్చిన అదృష్టంతో జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. సాఫీగా నడుస్తున్న జీవితంలో ఒడుదొడుకులు చోటు చేసుకోవచ్చు. కాని భయపడకండి. మీరు జీవితాన్ని చక్కగానే నడిపించుకుంటారు. రిస్క్ తీసుకునేందుకు, విందు వినోదాలకు డ బ్బూసమయం వెచ్చించేందుకు వెనకాడవద్దు. కలిసిచ్చే రంగు: ముదురు నీలం క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ప్రమోషన్ లేదా భారీగా జీతం పెంపు ఉండవచ్చు. వ్యాపారంలో పెద్దగా అవకాశాలు కలిసి రావడం లేదని బాధపడకండి, మీ వలలో ఒక్కసారిగా పెద్ద తిమింగలమే పడవచ్చు. లేనిపోని భయాందోళనలు, తటపటాయింపులతో అవకాశాన్ని వదులుకోవద్దు. జీవిత భాగస్వామి లభిస్తుంది. లేదా మీ బంధంలో తికమక ఏర్పడవచ్చు. కలిసొచ్చే రంగు: రేగుపండు లేదా కిస్మిస్ రంగు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. సవాళ్లను అధిగమించి, బాధ్యతలను నెరవేర్చుకుంటారు. ధనయోగానికి ఆట్టే దూరం లేదు. నెలాఖరుకల్లా కొంత డబ్బు వస్తుంది. ప్రేమపరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెళ్లిపరంగా అయితే రకరకాల సంబంధాలు వస్తాయి. అయితే టారో సాయంతో సరైన భాగస్వామిని ఎంచుకోండి. కలిసొచ్చేరంగు: దొండపండు రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) జీవితం మీరాశించిన మలుపు తిరగడం లేదని దిగులెందుకు? పదును పెడితే మీ బుర్రలోనే రకరకాల ఆలోచనలున్నాయి. విల్పవర్తో మీ మార్గాన్ని నిర్దేశించుకోండి. పాజిటివ్‌గా ఆలోచిస్తే శారీరక ఆరోగ్యం అదే సర్దుకుంటుంది. ఈ వారంలో మీ మాటల్లోనూ, చేతల్లోనూ లేదు, కాదు, కుదరదు అనే పదాలకు చోటివ్వకండి. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: నాచురంగు టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చాలని ప్రయత్నించవచ్చు ఈ వారంలో. అలా తలదూర్చడం అంత మంచిది కాదు. ఒకవేళ మీ ఇష్టంతో ప్రమేయం లేకండా అలా తలదూర్చవలసి వస్తే తప్పుకోవడం ఎంతో మంచిది మీకు. ఏదో జరిగి పోతోందేమోన నే ఆందోళన మీకు కలగవచ్చు. దాని కారణంగా శారీరక అనారోగ్యం కలగవచ్చు. తీవ్రంగా ఆలోచించకండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీరు సహజంగా మాట్లాడే ధోరణిలో కొంత ఎక్కువకి వెళ్లి మాట్లాడే ధోరణి కనిస్తోంది. అయితే ఇంటా బయటా కూడా ఎంత అవసరమో అంతే మాట్లాడటం మంచిది ఈ వారం. ఒకవేళ వెళ్తే అనవసర వివాదాలు తప్పవు. ఆదాయ వ్యయాల విషయంలో పరిమితిని దాటి వెళ్లకండి. ఆదాయమే ధ్యేయమనుకుంటూ సమయాన్నీ, ఆరోగ్యాన్నీ నష్టపరచుకోకండి. జెమిని (మే 21-జూన్ 21) కుటుంబంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది గాని, దంపతుల్లో ఏకాభిప్రాయం సాధ్యపడకపోవచ్చు. మీకు స్థానచలనం ఇప్పట్లో ఇష్టంలేని అంశం కాబట్టి మరో నాలుగు నెలలపాటు వాయిదా వేయడం ఉత్తమం. కుటుంబంతోనూ, బయటివారితోనూ విసుగుదలతో పారపాటున కూడా తీవ్రంగా మాటలాడకూడదు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఓ ఆధ్యాత్మిక భావం గాఢంగా ప్రవేశిస్తుంది. భగవంతుడి పట్ల ఏదో తప్పు చేశానేమోననే మానసిక చింత వేధిస్తుంటుంది. ఇది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనిశ్చితంగానూ, పరిష్కారం కాకుండానూ ఉన్న ఒక సమస్య కారణంగా కలిగే మనోవేదనే తప్ప మరేమీ కాదు. సమస్యని మీకు మీరుగా ధైర్యంగా పరిష్కరించుకుంటే ఈ దిగులు తీరుతుంది. లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రశంసిస్తే చాలు పొంగిపోయి మీరు లోగడ చేసిన వాగ్దానాలూ శ్రుతిమించి చేసిన ఖర్చులూ... దాదాపు తీరి ఇప్పుడొక తోవకి రాగలిగారు. ఈ దశలో కూడా మళ్లీ వెనుక ధోరణిలోనే మందీ మార్బలంతో వెళ్లడం సరికాదు. నిర్ద్వంద్వంగా చేయలేననో- చేయననో - సాధ్యపడదనో ఉన్నదున్నట్లు చెప్పండి తప్ప, మొగమాటపడి మీ కాళ్లకి మీరే సంకెళ్లు వేసుకోవద్దు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ రంగంలో మీరు చేస్తున్న కృషి అమోఘం. ప్రతి అభ్యంతరానికీ సమాధానాన్ని తెల్పుతూ కార్యసాధనపట్ల మీకున్న ఆ దీక్షని అలాగే కొనసాగించండి. నిరుత్సాహపరులూ ఒక వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో ఓడిపోయిన వ్యక్తులతో దూరంగా ఉండండి. లేనిపక్షంలో వారి నిరుత్సాహం మీ ఉత్సాహాన్ని కృంగదీయవచ్చు- మీ కృషి దెబ్బతినవచ్చు. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీరు ఈ వారంలో ఏమాత్రమూ చేయడానికి ఇష్టపడని పనిని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిలో ఉంటారు. ఆ పనిని పూర్తి చేసే అవకాశమూ ఉంది కూడా. మనస్సాక్షికి వ్యతిరేకంగా పూర్తి చేసిన ఆ పనిని గురించి ఆలోచిస్తూ గడుపుతారు ఈ వారాన్ని. ఒకరికి కష్టం, మనోవేదనా కలిగించే పనిని చేయదలచడం, చేయడం సరికాదు. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటూ తోచని పరిస్థితిలో ఉండడం, మనోవేదనని అనుభవిస్తూండడం జరుగుతున్న యథార్థమే. అయితే ఈ వారంలో కావాలని మీ విషయంలో బాధించే వారికి పరాజయం కలిగి, విజయం మీవైపే ఉంటుంది. చెట్టునుండి జారి వెల్లకి లా నేలపడ్డవాని నోట్లో, పై కొమ్మనున్న తేనె తుట్టె నుండి తేనె చుక్కలు పడుతున్నట్టుంటుంది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) దూరపు చోటికి వెళ్లవలసిన పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉన్నా సంతానపు చదువూ అభివృద్ధీ దిగులుగా అనిపిస్తుండొచ్చు. చదువు కంటే సంస్కారం, ప్రవర్తన గొప్పవని భావించండి. ఇంటి పరిస్థితి గురించి ఆనందమే అన్పిస్తున్నప్పటికీ సంతానపు ఒకరి అలవాట్లూ ప్రవర్తనా కొద్దిగా వేదనని కల్గించేవి కావచ్చేమో గమనించుకోండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) శారీరకంగా గాని, మానసికంగా కాని దిగులు చెందాల్సిన సందర్భాలేమీ లేవు. సంతానానికి ఉద్యోగం లేదా మరో విజయం కలిగి ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన సొమ్ములన్నీ సకాలంలో వస్తున్న కారణంగా ఆనందంగా ఉంటారు. రావలసిన ఉద్యోగమో, కావలసిన శుభ కార్యమో వాయిదా పడినా దిగులు లేకుండా ఉండే ధైర్యం మీకుంటుంది ఈవారంలో. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అనాలోచితంగా చేసిన ఓ పని గురించిన వ్యగ్రతతో ఉంటారు. మీరు చే సిన దానికి ఏమాత్రపు వ్యతిరేకతా మీకు కలగదు- ఏ నష్టమూ ప్రాప్తించదు. నిర్భయంగా ఉండండి. అయితే మీరు పై స్థాయి ఉద్యోగులవుతూ మీ కింది ఉద్యోగుల ఆజమాయిషీ మీది అయిన పక్షంలో శ్రద్ధని వహించి ఉండవలసిందే తప్ప ప్రమత్తత పనికి రాదని గమనించండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ముఖ్యకార్యాలు, తప్పనిసరిగా పూర్తి చేయవలసిన పనుల విషయంలో శ్రద్ధ వహించండి. దానికంటే ముందుగా ఈ వారంలో చేయకుండా కొద్దిగా పైవారానికి జరుపుకుంటే మంచిది. ఈ వారంలోనే చేసి తీరవలసి ఉంటే మరింత దూరదృష్టితో చేయండి. అంతా సక్రమంగానే చేయగలిగానా? అనే సంశయం మీకుండొచ్చు- అయితే ఏ నష్టమూ మాత్రం రాదు. మైలవరపు శ్రీనివాసరావు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement