breaking news
mahila farmers
-
నేలతల్లి ముద్దుబిడ్డల శిగలో పద్మశ్రీలు!
వ్యవసాయానికి మహిళల శ్రమే పట్టుగొమ్మ. అయినా, ఈ రంగం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకోవడం అరుదనే చెప్పాలి. ఈ ఏడాది వ్యవసాయ రంగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన పది మందిలో ఇద్దరు మహిళా రైతులు ఉండటం విశేషం. ఒడిశాకు చెందిన గిరిజన సేంద్రియ మహిళా రైతు కమలా పూజారి ఒకరైతే, బిహార్‌కు చెందిన మహిళా రైతు రాజ్‌కుమార్ దేవి మరొకరు! విశేషమేమిటంటే.. కొద్ది నెలల క్రితమే ఈ ఇద్దరి గొప్పదనం గురించి ‘సాక్షి’ ప్రచురించింది. వీరిని పద్మశ్రీ పురస్కారం వెదుక్కుంటూ వచ్చిన శుభసందర్భంలో ఈ అద్భుత మహిళా రైతులకు జేజేలు పలుకుదాం.. రైతు పెద్దమ్మ రాజ్‌కుమార్ దేవి! బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదగగలరనడానికి రాజ్‌కుమార్ దేవి జీవితమే నిలువుటద్దం. తాజాగా ఆమె పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బిహార్‌లోని ముజఫర్çపూర్ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పూర్ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేశారు. 30 ఏళ్ల క్రితం తొలిసారి ఆమె పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు ఆ ప్రాంతీయులకు తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఒకరి వెనుక మరొకరు ఆమెను అనుసరించారు. వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది. ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. సేంద్రియ సేనాని కమలా పూజారి! కమలా పూజారి వయసు 67 ఏళ్లు. గిరిజన మహిళా రైతు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పత్రాపుట్ గ్రామం ఆమె స్వస్థలం. భుమియ గిరిజన తెగలో పుట్టిన కమలకు దేశీ వరి వంగడాలన్నా, సేంద్రియ వ్యవసాయమన్నా పంచప్రాణాలు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో ఆమెకు పేరు ఇప్పుడు దేశమంతటికీ తెలిసింది. అయితే, కొద్ది నెలల క్రితం కూడా ఆమె పేరు ఒడిశాలో మారుమోగింది. అందుకో బలమైన కారణమే ఉంది మరి. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలిగా అప్పట్లో కమల నియమితులయ్యారు. అంతేకాదు, ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మహిళా హాస్టల్ భవనానికి కమల పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కమల నియామక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరచినప్పటికీ.. ఈ పదవి ఆమెకు అంత అయాచితంగా ఏమీ రాలేదు. సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యానికి.. ముఖ్యంగా అపురూపమైన దేశీ వరి వంగడాలకు ఒడిశాలోని జేపూర్ పెట్టింది పేరు. జేపూర్ బ్లాక్‌లోనే ఉంది కమల స్వగ్రామం పత్రాపుట్. వేలాది ఏళ్లుగా తమవై విరాజిల్లుతున్న వందలాది దేశీ వరి వంగడాలు అంతరించిపోతుండటం ఆమెను కలవరపరచింది. రసాయనిక వ్యవసాయం పుణ్యమా అని అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాల వల్ల దేశీ వంగడాలు కాలగర్భంలో కలసిపోతుండటం ఆమెకు సుతరామూ నచ్చలేదు. దేశీ వరి వంగడాలు అతివృష్టిని, కరువు కాటకాలను తట్టుకొని నిలబడి.. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంత విలువైన వంగడాల పరిరక్షణ సజావుగా సాగాలంటే సేంద్రియ వ్యవసాయం వ్యాప్తిలోకి తేవాలని కమలా పూజారి దశాబ్దాల క్రితమే గ్రహించారు. ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ నేర్పిన మెలకువలు ఆమె తన లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడ్డాయి. లక్ష్య సాధనకు రైతుగా తాను పాటుపడటంతోపాటు తమ గ్రామంలో గడపగడపకు, ఆ ప్రాంతంలోని గ్రామ గ్రామానికీ వెళ్లి ఇదే విషయాన్ని కమల ప్రచారం చేశారు. అవాంతరాలు ఎదురైనా దీక్షతో కదిలారు. ఫలితంగా పత్రాపుట్, ఆ పరిసర గ్రామాల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. ఆమె కృషికి గుర్తింపుగా 2004లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో సత్కరించింది. జోహన్నెస్‌బెర్గ్(దక్షిణాఫ్రికా)లో 2002లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలోనూ ఆమె తన గళం వినిపించారు. -
జగన్ దీక్ష.. టీడీపీ పతనానికి నాంది
-
ప్రాణం తీసిన అప్పులు
గోపాల్పేట, అమ్రాబాద్ : ఇంటి భారాన్ని మోయడానికి అరకకట్టి వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళారైతులు అప్పుల బాధకు బల య్యారు. గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన తులిసె లక్ష్మీదేవమ్మ(48), అమ్రాబాద్ మండలం పదర గ్రామవాసి మన్నెం నర్సమ్మ(40)లు ఖరీఫ్‌లో సాగుచేసిన పంటపై చేసిన అప్పులు తీరుద్దామనుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికి రాకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలిలా.. మన్ననూరుకు చెందిన తులిసె పెంటయ్య పొలం పనులు చేయకపోవడంతో ఆమె భార్య లక్ష్మీదేవమ్మ ఆడిపిల్లల పెళ్లిళ్లు చేయడానికి పొలంపనులు ప్రారంభించింది. ఉన్న మూడెకరాల్లో నీటి ఆధారం లేకపోవడంతో విడతల వారీగా నాలుగు బోర్లు వేసింది. వాటిలో మూడు ఎండిపోయాయి. ఒకదాంట్లో అరకొరగా నీరు వస్తుండగా దానిపై ఆధారపడి ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను సాగు చేసింది. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఈ సారి సేద్యానికి దూరమైంది. బోర్లకోసం చేసిన * 2 లక్షలు, మహిళా సంఘాల ద్వారా తీసుకున్న * 50 వేలు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. వడ్డీ కట్టేందుకు భర్త పెంటయ్య ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అప్పు లు భారమై ఎలా తీర్చాలనే దిగులుతో లక్ష్మీదేవమ్మ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గుళికల ముందు తాగింది. ఇది గమనించిన కుమారుడు శ్రీను జిల్లా ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ సంఘటనపై ఎస్సై కోట కరుణాకర్ కేసు నమోదు చేశారు. పంట దిగుబడికి రాక.. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట చేతికంద కపోవడంతో అమ్రాబాద్ మండలం పదర గ్రామానికి చెందిన మన్నెం నర్సమ్మ(40) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉన్న రెండెకరాల పొలంలో ఈ ఏడాది పత్తిపంటను సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట ఎండిపోగా *40వేల వరకు అప్పులయ్యాయి. కుటంబ అవసరాల కోసం మరో *50 వేల వరకు అప్పులున్నాయి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఉదయం నర్సమ్మ చేన్లోనే పురుగుల మందు తాగింది. చాలాసేపటి తర్వాత పక్క పొలం వారు గమనించి ఇంటికి తీసుకొచ్చేలోపే చనిపోయింది. మృతురాలికి భర్త మల్లయ్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు.