నైజీరియన్ చీటర్స్ గ్యాంగ్ ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: ఓ వ్యాపారిని మోసం చేసిన నైజీరియన్ చీటర్స్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరబాద్ వ్యాపార కార్యకలాపాలు చేస్తున్న మహేంద్ర పటేల్ వద్ద భారీగా డబ్బులు తీసుకుని ఉడాయించి ఆ గ్యాంగ్ ను నార్త్‌జోన్ పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో మహేంద్ర పటేల్ వద్ద నుంచి గ్యాంగ్ సభ్యుల్లో ఒకరైన ఆశా కిరణ్ అనే యువతి రూ.50 లక్షల వరకూ వసూలు చేసి ఆపై కనిపించకుండా పోయింది. దీంతో అసలు విషయాన్నిగ్రహించిన మహేంద్ర పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇందులో భాగంగా దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్ పోలీసులు చీటర్స్ గ్యాంగ్‌లో కొంతమంది సభ్యులను అరెస్టు చేశారు. కాగా, ఆశా కిరణ్ అనే యువతి పరారీలో ఉంది. ఆ యువతి రూ.50 లక్షల్లో కేవలం రూ.15 లక్షలను మాత్రమే నైజీ రియన్స్ బ్యాంక్ ఖాతా లో జమ చేసినట్లు పోలీసులు తెలిపారు.