breaking news
Mahaveer Phogat
-
వినేశ్ రాజకీయం నాకిష్టం లేదు: మహవీర్ ఫోగట్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో జరిగే హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారని సమాచారం. ఇక.. ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ ప్రవేశంపై ఆమె పెద్దనాన్న మహవీర్ ఫోగట్ ప్రతికూలంగా స్పందించారు. వినేశ్ ఫోగట్ రాజకీయ రంగ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే..‘‘మరో ఒలింపిక్స్(2028)లో వినేశ్ పాల్గొనాలని కోరుకుంటున్నా. ఆ పోటీలో ఆమె బంగారు పతకం గెలవాలి. అందుకోసం ఆమె మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి సారించాలి. ఆమె రాజకీయాల్లో చేరటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. యువకులైన పిల్లలు వాళ్లు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వారిపైన ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చజెప్పటమే నా బాధ్యత.ఈ వయస్సులో వినేశ్ మరో ఒలింపిక్స్‌లో పాల్గొనటమే సరియైంది. ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నా. బ్రిజ్ భూషన్‌పై రెజ్లర్లు అంతా నిరసనలు చేశారు. దాని వల్ల ఏం న్యాయం జరగలేదు. హర్యానాలో ఎన్నికల ప్రకటన వెలువడి.. వినేశ్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక అన్ని చర్చలు మొదలయ్యాయి’’ అని అన్నారు. వినేశ్ రెజ్లింగ్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మహవీర్ ఫోగట్ పునఃపరిశీలించాలని ఇటీవల కోరిన విషయం తెలిసిందే.మరోవైపు.. వినేశ్, భజరంగ్ పూనియాలో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. వినేశ్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకే.. భగవంతుడు ఆమెకు పతకం చేజారేలా చేశాడని అన్నారు. -
ఆమిర్ 'దంగల్' ట్రైలర్ వచ్చేసింది
ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దంగల్. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తొలి సారిగా ఆమిర్ ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలకు తండ్రిగా 50 ఏళ్ల వయసు వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు. పికె సినిమా తరువాత ఇంత వరకు ఆమిర్ సినిమా రిలీజ్ కాకపోవటంతో అభిమానులు దంగల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలల సమయం ఉన్నా ముందుగానే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్లోనే రివీల్ చేశారు. తన దేశం కోసం బంగారు పతకం సాధించాలనుకున్న మహావీర్ అది సాధ్యం కాకపోవటంతో నిరుత్సాహపడతాడు. తాను చేయలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు నలుగురు కూతుళ్లే కావటంతో తన కల నెరవేరదని అనుకుంటున్న సమయంలో.., తన కూతుళ్ల శక్తిని గుర్తించి వారినే రెజ్లర్లుగా తయారు చేస్తాడు. రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్న ఆమిర్, ఆ లుక్స్ కోసం చాలా కష్టపడ్డాడు. వయసైన పాత్ర కోసం లావుగా తయారయ్యాడు. తరువాత కుర్రాడిగా బరిలో దిగే రెజ్లర్ లుక్ కోసం భారీ కసరత్తులు చేసి కండలు తిరిగిన దేహంతో మరోసారి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. -
ఆమిర్ 'దంగల్' ట్రైలర్ వచ్చేసింది