breaking news
madnapalli
-
ముహూర్తం టైమ్‌కి వధువు మాయం.. 2 గంటల వ్యవధిలోనే
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): కొద్దిసేపటికి పీటలపై కూర్చొని వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. వధువు ముహూర్తపు దుస్తులు కట్టుకోవడానికి గదిలోకి వెళ్లింది. పెళ్లికూతురు అటు నుంచి అటే అదృశ్యమై, తన ప్రియుడితో వివాహం చేసుకున్న ఘటన మదనపల్లెలో చర్చనీయాంశమైంది. టూటౌన్ సీఐ నరసింహులు కథనం మేరకు.. మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. శని, ఆదివారాల్లో పెళ్లి జరిగేలా పెద్దలు నెల రోజుల క్రితం పత్రిక రాయించుకున్నారు. శనివారం రాత్రి రిసెప్షన్ జరిగింది. ఆదివారం పెళ్లి మహూర్తానికి పెళ్లికూతురు, పెళ్లికొడుకుతోపాటు బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. 5.30 గంటలకు ముహూర్తం కాగా ఆ సమయానికి పెళ్లి చీర కట్టుకునేందుకు సోనిక గదిలోకి వెళ్లి తిరిగి రాకుండా పోయింది. ఆదివారం ఉదయం గొల్లపల్లెకు చెందిన తన ప్రియుడు చరణ్‌తో పుంగనూరుకు వెళ్లి ఓ గుడిలో వివాహం చేసుకుంది. పెద్దలతో తనకు ప్రమాదం ఉందని మదనపల్లె టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. అయితే పెళ్లికొడుకు బంధువులు తాము పెళ్లి కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టామని, తమకు అవమానం జరిగిందని పెద్దలతో కలిసి టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. కాగా సోనిక ఎంబీఏ చదివి, స్థానిక గురుకుల పాఠశాలలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని సోనిక ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నాన్న కోసం వచ్చిన పుత్రుడు
మదనపల్లె క్రైం : ‘నాన్నను వదిలేశారు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన స్వర్ణకారుడు ఉత్తరాది రంగాచారి కథనం కన్నబిడ్డ హృదయాన్ని కదిలించింది. సోమవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగాచారిని వెతుక్కుంటూ వచ్చిన కుమారుడు నాగరాజు ఆయనను అక్కున చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగు నెలల క్రితం అంగడికని చెప్పి ఇంట్లోనుంచి వచ్చిన తన తండ్రి దారి తప్పిపోవడం వల్లే ఇలాంటి కష్టాలు వచ్చాయన్నారు. ‘సాక్షి’ చిత్తూరు, అనంతపురం జిల్లా ఎడిషన్లలో ప్రచురితమైన కథనం చూసి స్థానికంగా ఉన్న తన స్నేహితులు, మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన అర్షద్ హజరత్, మరో యువకుడు మహబూబ్ ఖాన్ తన వద్దకు వచ్చి విషయం చెప్పారన్నారు. వెంటనే స్నేహితుడిని వెంటపెట్టుకుని ఇక్కడికి వచ్చేశానన్నారు. తమది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గాంధీనగరని తెలిపిన ఆయన రోడ్డు పక్కన పడి ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టిన దయార్ధ్ర హృదయులకు కృతజ్ఞతలు తెలిపారు.