breaking news
Maddirala
-
‘మా మేడమ్ మాకే కావాలి.. ’
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ ఆ పాఠశాలలో ఏడేళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమె ఇప్పుడు బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ మీద మోతె మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. వనజ మంగళవారం పాఠశాల నుంచి రిలీవ్ అవుతుండగా.. విద్యార్థులు ఆమెను చుట్టుముట్టి ‘మా మేడమ్ మాకే కావాలి. మేడమ్ మీరు వెళ్లొద్దు’ అంటూ రోదించారు. విద్యార్థులు రోదించడంతో టీచర్ (Teacher) వనజ వారిని చూసి కన్నీరుపెట్టుకున్నారు. ‘వలస కూలీ’పై ప్రత్యేక బోధన మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కొత్తపల్లి ప్రభాకర్ వినూత్నంగా పాఠాలు బోధిస్తుంటారు. పాఠ్యాంశంలోని పాత్రలను స్వయంగా జరిగే ప్రాంతానికి గానీ, లేదా స్వయంగా విద్యార్థులకు వేషధారణ చేసి వారు స్వీయ అవగాహన చేసుకునేలా బోధిస్తారు. అందులో భాగంగా మంగళవారం పాఠశాలలో 9వ తరగతి తెలుగు సబ్జెక్టులోని ‘వలస కూలీ’ పాఠాన్ని.. విద్యార్థికి వలస కూలీ వేషం వేసి పాత్ర సన్నివేశాల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు (Students) ఇలా నేర్చుకోవడం వల్ల ఆ పాఠాన్ని ఎప్పటికీ మరిచిపోరని ఉపాధ్యాయుడు ప్రభాకర్ చెప్పారు. బాల్యం ఆటలోనే బందీవారిది పలకాబలపం పట్టుకొని బడి బాట పట్టాల్సిన బాల్యం. కానీ.. తల్లిదండ్రుల పేదరికమో.. విద్యా అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆటపాటలతోనే భవిష్యత్‌ను బందీ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పని చేసే ఫ్యాక్టరీ ఎదుట కొందరు బోరింగ్ పంపునకు ఊయల కట్టుకొని, మరికొందరు మట్టిలోనే గడుపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన బడిబాట, చదువుకు దూరంగా ఉన్న పిల్లలకోసం ముస్కాన్ (Muskaan) లాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటచదవండి: మంచిర్యాల యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్ -
ఇంట్లో నుంచి తల్లిదండ్రుల గెంటివేత
మద్దిరాల: నవమాసాలు మోసి.. కని,పెంచి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కుమారులు ఇంటి నుంచి గెంటివేశారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దేవులపల్లి వీరయ్య రాములమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దేవులపల్లి వెంకన్న, లింగయ్య. పెద్ద కుమారుడు వెంకన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. చిన్నకుమారుడు లింగయ్య హైదరాబాద్‌లో పెయింటింగ్ పని చేస్తూ.. అక్కడే ఉంటున్నాడు. గ్రామంలో కుమారులు ఇద్దరూ ఇళ్లు నిర్మించుకున్నారు. చిన్న కుమారుడు లింగయ్య హైదరాబాద్‌లో ఉండటంతో అతని ఇంట్లో తల్లిదండ్రులు ఉంటూ పింఛన్‌తో కాలం వెల్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ముల నడుమ తగాదాలు జరుగుతుండడంతో చిన్నకుమారుడు తన ఇంట్లో ఉండవద్దని తల్లిదండ్రులను బయటికి గెంటివేశాడు. దీంతో ఆ వృద్ధ దంపతులు వీధిన పడ్డారు. స్థానికులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆ దంపతులను ఇంట్లోకి తీసుకెళ్లారు. కుమారులిద్దరికీ సోమవారం స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్ఐ మగ్దూమ్ అలీ తెలిపారు. -
రైతులపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం
వనపర్తి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అప్పుల బాధతో చనిపోయిన రైతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పుష్కరాల ముగింపు రోజన రంగాపూర్ ఘాట్‌లో పిండప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు రాజశేఖర్, పి.భాస్కర్, కె.వెంకటేష్, శివశంకర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
గోపాల్పేట: హైదరాబాద్ ఫిలింనగర్లో అక్రమంగా నిర్మిస్తున్న కల్చరర్ క్లబ్ కూలి మతిచెందిన కూలీల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫిలింనగర్ కల్చరర్ కమిటీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని, శిథిలాల కింద కూరుకుపోయిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లో ఎవరి ఇష్టానుసారంగా వారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఫిలింనగర్ కమిటీపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని -
వైఎస్సార్సీపీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా మద్దిరాల
వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవిభాగం అధ్యక్షునిగా వనపర్తికి చెందిన నేత మద్దిరాల విష్ణువర్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ఉత్తర్వులను గురువారం శ్యాంసుందర్‌రెడ్డి చేతుల మీదుగా విష్ణువర్దన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీలో ఉన్నత స్థానం కల్పించిన పెద్దల ఆదేశం మేరకు పార్టీ అభివృద్ధ్ది కోసం కృషి చేస్తానని విష్ణువర్దన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు భాస్కరాచారి, రాజశేఖర్, మహేష్, బుడ్డన్న, జైపాల్‌రెడ్డి, వెంకట్రావ్, వెంకటేష్ ఉన్నారు.