breaking news
Machine tool industry
-
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
వైజాగ్లో జీపీఎస్ సర్వే యంత్ర పరికరాల పరిశ్రమ
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే భూముల సర్వే, పలు రకాల భవన సముదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసే యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు జీయో ట్రాక్స్ ఇం టర్నేషనల్ సర్వీసెస్ అధ్యక్షులు వీవీఎస్ బందుకవి తెలిపారు. చైనా సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వైజాగ్లో 2 వేల ఎకరాలను కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా జీయో ట్రాక్స్ స్థాపించే అధునాతన జీపీఎస్ సర్వే పద్ధతులను సంస్థ ప్రతినిధులతో కలిసి శని వారం హైదరాబాద్లో మీడియాకు వివరించారు. చైనా హాస్ నావిగేషన్ కంపెనీ జీపీఎస్ టెక్నాలజీతో అత్యంత సులువుగా, వేగంగా భూములను సర్వే చేస్తుందన్నారు.