breaking news
M & M Group
-
వారి కోసం ఎం అండ్ ఎం కొత్త ప్రాజెక్టు
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా మహిళా రైతుల కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రేరణ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సోమవారం ప్రకటించింది. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు ప్రోత్సాహ్నన్నందించే దిశగా ఈ పథకాన్ని లాంచ్ చేసినట్టు మహీంద్ర అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో తెలిపింది. 19 బిలియన్ డాలర్ల వ్యయంతో మహిళలకు మెరుగైన వ్యవసాయ సామగ్రి అందించడం, ప్రచారం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటూ మహిళా రైతులు ఎదిగేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు, సమర్థతా వ్యవసాయ పరికరాలను, సామగ్రిని అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళా రైతుల సాధికారత సాధన, మద్దతు అందించనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. 30కి పైగా గ్రామాల్లో 1,500 కుటుంబాలపై ప్రభావం చూపే ఉద్దేశంతో ఈ ప్రేరణ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్ర ఒక ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్ర సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ (CIWA), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), ఎన్జీవో ప్రధాన్ (ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్) ల సంయుక్త సహకారంతో ప్రెన్నాలో మొదటి ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 100 మిలియన్ల మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారని, వీరిలో చాలామంది పొలాలలో ఎక్కువ సమయం పనిచేసేవారేనని తెలిపింది. అలాగే వీరికి అనువైన వ్యవసాయ సాధనాలు, ఇతర పరికరాలు చాలావరకు అందుబాటులో లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రేరణ పథకంలో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా కింద ఈ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. -
మార్కెట్లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!
న్యూఢిల్లీ: బ్రాండెడ్ పప్పు దినుసుల వ్యాపారంలోకి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) అగ్రి బిజినెస్ డివిజన్ ప్రవేశించింది. న్యూప్రో బ్రాండ్‌తో కందిపప్పును ముంబై మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. మరిన్ని పప్పు దినుసులను త్వరలో తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు మూడేళ్లను కంపెనీ నిర్దేశించుకుంది. సహజసిద్ధంగా సూర్యకాంతి ద్వారా ప్రాసెస్ జరిగే ఈ కందిపప్పు మార్కెట్లోని ఇతర సంబంధిత ప్రొడక్టులతో పోల్చితే 50 శాతం తొందరగా ఉడుకుతుందని ఎం అండ్ ఎం గ్రూప్ అగ్రి ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు.