breaking news
Luke Pomersbach
-
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వివాదాల్లో చిక్కుకున్న అంతర్జాతీయ క్రికెటర్లు వీరే..!
క్రీడల్లో ఆన్ ఫీల్డ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల కెరీర్లు అర్దంతరంగా ముగిసిపోతాయి. తాజాగా ఓ భారత యువ క్రికెటర్ పెద్దగా పరిచయం లేని యువతితో సోషల్‌మీడియాలో అసభ్యకరమైన సంభాషణ చేసి వార్తల్లోకెక్కాడంతో ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్న అంతర్జాతీయ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాతో ముందుగా వచ్చేది టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. అద్భుతమైన టాలెంట్ కలిగి, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. 2023లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్లిక్‌లో ఘర్షణకు దిగి అప్పటికే పతనమైన కెరీర్‌ను అదఃపాతాళానికి పడేసుకున్నాడు. ఈ ఎడిసోడ్ కారణంగా షా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనప్పటికీ.. కెరీర్లో నిలదొక్కుకునే అవకాశాలు కోల్పోయాడు.ఈ జాబితాలో రెండో పేరు లూక్ పోమర్స్‌బాచ్. ఆ మాజీ ఆసీస్ ఆటగాడు 2013 ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీలో ఓ మహిళపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు సెటిల్మెంట్కు వచ్చినప్పటికీ.. పోమర్స్‌బాచ్ కెరీర్ పెద్దగా ముందుకు సాలేదు.రుబెల్ హొసైన్ఈ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ 2015లో నటి నజ్నిన్ ఆక్టర్ హ్యాపీపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నిలబడనప్పటికీ.. రుబెల్ కెరీర్లో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదంతం తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.మొహమ్మద్ షహ్జాద్ ఈ ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసకర బ్యాటర్ 2018లో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతం తర్వాత షహ్జాద్ క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణలో షహ్జాద్ తప్పుచేసినట్లు తేలిందని ప్రచారం జరిగింది.దనుష్క గుణతిలక శ్రీలంకకు చెందిన ఈ మాజీ ఆటగాడు 2018లో ఇంగ్లండ్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇతగాడు 2022లో ఆస్ట్రేలియాలో కూడా ఓ మహిళపై లైంగిక దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో గుణతిలక అరెస్టు కూడా అయ్యాడు. ఈ రెండు ఉదంతాల కారణంగా అతని కెరీర్ పట్టాలెక్కకుండానే గాడి తప్పింది. గుణతిలక చెడుకు శ్రీలంక క్రికట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.అంతర్జాతీయ క్రికెటర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా ఓ మహిళతో సోషల్‌మీడియా వేదికగా అసభ్యంగా సంభాషిస్తూ వార్తల్లోకెక్కాడు. తనతో చికారా చేసిన అభ్యంతరకరమైన చాట్‌ను సదరు యువతి సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అదే యువతి తాజాగా మరో ఐపీఎల్ ఆటగాడు (డీసీకి చెందిన అభిషేక్ పోరెల్) కూడా తనతో చాట్ చేశాడని పోస్ట్ పెట్టింది. -
ఒకప్పుడు స్టార్ క్రికెటర్.. ఇప్పుడు దొంగ!
సిడ్నీ: సాధారణంగా ఏ క్రికెటరైనా తమ కెరీర్లో ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడాలని కోరుకుంటారు. ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే తమ దశే తిరిగి పోతుందని భావిస్తుంటారు. అలాంటిది.. ఒక్కసారి కాదు.. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడి, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో కూడా ప్రాతినిథ్యం వహించిన ఆ క్రికెటర్ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆసీస్ మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్స్ బాచ్ ఇందుకు భిన్నం. అతని ప్రవర్తనతోనే తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు టీ20 స్టార్ క్రికెటర్‌గా వెలిగి ఇప్పుడు ఏకంగా దొంగగా మారిపోయాడు. ల్యూక్ పోమర్స్ బాచ్.. ఒకప్పుడు తారాజువ్వలాగా ఎగిసి పడ్డాడు. 2007లో ఆస్ట్రేలియా తరపున పోమర్స్ బ్యాచ్ ఏకైక టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. దీంతో తర్వాతి ఏడాది జరిగిన ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ జట్టులో చోటుదక్కించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా ఆడాడు. ఇలా 2008 నుంచి 2013 వరకూ ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు. 2013లో కింగ్స్ పంజాబ్ అతన్ని మూడు లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. తన ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడాడు. అతను మొత్తం 17 మ్యాచ్‌ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్లో 302 పరుగులు చేశాడు. 2012 ఐపీఎల్లో ఒక అమెరికన్ యువతిని వేదించడంతో అతను అరెస్ట్ అయ్యాడు. 2014లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఒక సారి బైకు దొంగతనం చేసి, మరోసారి లిక్కర్ షాప్ నుంచి మద్యం దొంగిలించి అరెస్టయ్యాడు. ఈక్రమంలో కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో తల దాచుకున్నాడు. తాజాగా దొంగతనంలో మరోసారి ల్యూక్ అరెస్టయ్యాడు. బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా ప్రాతినిథ్యం వహించిన ల్యూక్ గురించిన తెలిసిన అభిమానులు మాత్రం విధి ఎంత చిత్రమైనది అని ముక్కున వేలేసుకుంటున్నారు.


