breaking news
lovers phots
-
రహస్యంగా ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలు రికార్డ్.. ఫోన్ లాక్కొని చూడగా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: రహస్యంగా ప్రేమజంటల ఫొటోలు, వీడియోలు తీస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో వెలసిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో పాటు, పరిసర ప్రాంతాల్లో కట్టడాలను చూసేందుకు వస్తున్న ప్రేమ జంటలను రహస్యంగా సెల్ఫోన్లో చిత్రికరిస్తున్నాడు. దీనిని గమనించిన వారు ఫోన్ లాక్కుని చూడగా అందులో అప్పటికే ఇంతకు ముందు తీసిన 40 వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న స్థానికులకు విషయం చెప్పడంతో వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
ప్రేమికుడిపై దాడి.. ప్రియురాలిపై అత్యాచారం
హైదరాబాద్: హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల ఫోటోలు తీసి ప్రియురాలిపై దుండగులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రేమికులు ఫిర్యాదుతో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సన్నిహితంగా ఉన్న జంటను సెల్కెమెరాలో దుండగులు బంధించారు. కెమెరాతో తీసిన దృశ్యాలను బయటపెడతామంటూ జంటను బెదిరించారు. అదే సమయంలో ప్రేమికుడిపై దాడి చేసి, యువతిపై అత్యాచారం చేశారు. దాంతో బాధితురాలు తమపై దాడిచేసి, అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.