ప్రేమికుడిపై దాడి.. ప్రియురాలిపై అత్యాచారం | Lover raped by assaults at Hayathnagar | Sakshi
Sakshi News home page

ప్రేమికుడిపై దాడి.. ప్రియురాలిపై అత్యాచారం

Dec 3 2014 8:51 PM | Updated on Sep 2 2017 5:34 PM

హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల ఫోటోలు తీసి ప్రియురాలిపై దుండగులు అత్యాచారం చేశారు.

హైదరాబాద్: హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికుల ఫోటోలు తీసి ప్రియురాలిపై దుండగులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రేమికులు ఫిర్యాదుతో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సన్నిహితంగా ఉన్న జంటను సెల్కెమెరాలో దుండగులు బంధించారు. కెమెరాతో తీసిన దృశ్యాలను బయటపెడతామంటూ జంటను బెదిరించారు.

అదే సమయంలో ప్రేమికుడిపై దాడి చేసి, యువతిపై అత్యాచారం చేశారు. దాంతో బాధితురాలు తమపై దాడిచేసి, అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement