పెండ్లికుమారుడిగా అమరేశ్వరుడు
అమరావతి: ప్రముఖ క్షేత్రమైన అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా నిర్వహించే చండీ కల్యాణానికి శనివారం అర్చకులు అమరేశ్వరుడిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. చండీ కల్యాణ మహోత్సవం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం ఆలయంలో అంకురారోపణ, అగ్నిప్రతిస్థాపన, విఘ్నేశ్వర పూజ, ధ్వజపఠారోహణ నిర్వహించామని ఆలయ స్థానాచార్యులు జగర్లపూడి వెంకటేశ్వరశాస్త్రి తెలిపారు.