breaking news
Loot robbers
-
రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..
పారిస్: ఫ్రాన్స్ దేశంలో నహేల్ అనే ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇప్పటికింకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, దుకాణాలను లూటీ చేస్తున్నారు. తాజాగా కొన్ని అల్లరి మూకలు ఒక కార్ షోరూంని కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు నుండి నేటివరకు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తూ భగ్గుమంటూనే ఉంది. ఇంతవరకు ఈ అల్లర్లలో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేయగా పోలీసు బలగాల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకునేందుకు 45000 మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరిమూకలను చెదరగొడుతున్నా ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ఆందోళనకారులు పారిస్ నగరంలో ఎక్కడికక్కడ దుకాణాల్లోకి చొరబడి చేతికి దొరికిన వస్తువును తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కొంతమంది నిరసనకారులు అక్కడి వోక్స్ వ్యాగన్ కార్ షోరూంని కొల్లగొట్టి అందులోని ఖరీదైన కార్లను దొంగిలించారు. ఎంత కష్టపడితే మాత్రం ఇలాంటి లగ్జరీ కార్లను కొనడానికి జీవితకాలం సరిపోదని భావించారో ఏమో. షోరూంలోనో కార్లన్నిటినీ లూటీ చేశారు. దుండగులు కార్లను ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనికి కామెంట్ల రూపంలో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు వీక్షకులు. Car dealership looted in #FranceRiots. pic.twitter.com/fkKHil7H8J — Paul Golding (@GoldingBF) July 2, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
దేశ రాజధానిలో దారుణం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలో దోపిడి దొంగలు దారుణానికి ఒడిగట్టారు. కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి ఒకర్ని చంపి, నలుగురు మహిళలపై అత్యాచారం జరిపి దోపిడి చేశారు. ఈ ఘటన గురువారం ఉదయం ఢిల్లీకి 68 కిలోమీటర్ల దూరంలో ఉత్తర్ప్రదేశ్ లోని జెవార్ నగరంలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించడానికి కారులో గ్రేటర్ నోయిడా సమీపంలో జేవర్కు బయలుదేరారు. ఒంటి గంట సమయంలో కారుపై దుండగులు మెటల్ వస్తువు విసరడంతో హైవే మధ్యలో కారును నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా ఆరుగురు అగంతకులు మహిళలపై దాడి చేసి గ్యాంగ్ రేప్ చేసి వారి ఆభరణాలను దోచుకొని వెళ్లారు. వారిని కాపాడడానికి ప్రయత్నించిన 45 ఏళ్ల కుటుంబ సభ్యున్నిదారుణంగా చంపేశారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.