breaking news
Logan
-
ప్రపంచకప్‌లో సంచలనం, ఆంధ్ర ఆటగాడి విధ్వంసకర శతకం.. విండీస్‌కు ఘోర పరాభవం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో పెను సంచనలం నమోదైంది. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఈ టోర్నీలో తొలుత తమ కంటే చిన్న జట్టైన జింబాబ్వే చేతిలో చావుదెబ్బ తిన్న విండీస్.. నిన్న (జూన్ 26) జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న డచ్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. విండీస్ నిర్ధేశించిన 375 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తొలుత నెదర్లాండ్స్‌ను ఆంధ్ర (విజయవాడ) ఆటగాడు తేజ నిడమనూరు తన విధ్వంసకర శతకంతో (76 బంతుల్లో 111; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) గట్టెక్కించగా (స్కోర్లు సమం చేసేంత వరకు తీసుకెళ్లాడు), అనంతరం సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ (4,6,4,6,6,4) ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శతక్కొట్టిన పూరన్.. రాణించిన బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ ఛార్లెస్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. తేజ నిడమనూరు వీరోచిత శతకం.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. తేజ నిడమనూరు వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ను సమం (374/9) చేయగలిగింది. తేజకు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో లోగన్ వాన్ బీక్ ఊచకోత.. బంతితోనూ మ్యాజిక్ సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ ఊచకోత కోశాడు. జేసన్ హోల్డర్ వేసిన ఆ ఓవర్లో వాన్ బీక్ వరుసగా 4,6,4,6,6,4 బాదాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ చేతులెత్తేసింది. బ్యాట్‌తో మెరిసిన వాన్ బీక్ బంతితోనూ మాయ చేశాడు. తొలి బంతిని ఛార్లెస్ సిక్సర్ బాదగా.. రెండో బంతికి హోప్ ఓ పరుగు తీశాడు. అయితే ఆ మరుసటి రెండు బంతుల్లో వాన్ బీక్.. ఛార్లెస్, హోల్డర్లను ఔట్ చేయడంతో విండీస్ కథ ముగిసింది. నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. -
3న తెరపైకి లోగన్
బ్రహ్మాండమైన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం లోగన్ ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాన సంస్థ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి జేమ్స్మ్యాన్ గోల్డ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు దివాల్వేరిన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. హగ్ జాక్‌మ్యాన్ కథానాయకుడిగా నటించారు. చిత్ర వివరాలను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్వాహకులు లోగన్ చిత్ర వివరాలను తెలుపుతూ కామిక్ కథా చిత్రాల్లో బాగా పాపులర్ అయిన పాత్ర వాల్వేరిన్, ఆ పాత్ర ప్రధానంగా తెరకెక్కిన తాజా చిత్రం లోగన్ అని తెలిపారు. హగ్ జాక్‌మ్యాన్ వాల్వేరిన్ పాత్రలో నటించడం ఇది పదోసారి అని పేర్కొన్నారు. ఆయన ఇంతకు ముందు అతీంద్రీయ శక్తిదే పై చెయ్యిగా కలిగిన పాత్రల్లో నటించారని, ఇందులో మానవశక్తి మెండేనని చెప్పే పాత్రలో కనిపించనున్నారని తెలిపారు.లోగన్ త్రం 2029లో జరిగే కథగా సాగుతుందన్నారు. తన శక్తులను పక్కన పెట్టి ఒక బండి లాగుకుంటూ జీవనం గడపే హీరోకు మళ్లీ తన వక్తులను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. తన లాంటి శక్తులున్న ఒక యువతిని రక్షించాల్సిన బాధ్యత కలగడంతో ఆమెను ఎలా కాపాడాడు?అన్న పలు అబ్బురపరిచే సన్నివేశాలతో రూపొందిన చిత్రం లోగన్ అని తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి మూడో తేదీన తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.