breaking news
local TV channels
-
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
ఇక యప్ టీవీ సీరియల్స్...
సొంతంగా షూటింగ్; ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి ♦ త్వరలో ఓ స్పోర్ట్స్, తెలుగు చానల్‌తో ఒప్పందాలు ♦ దీంతో ఆ చానల్స్ కార్యక్రమాలు యప్ టీవీకే పరిమితం! ♦ నెలకు రూ.99కే 250 చానల్స్ ప్రసారం; వీక్షకులు 50 లక్షలకు పైనే ♦ ఇప్పటికే రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ♦ ‘సాక్షి’తో యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యప్ టీవీ అంటే!! ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదికగా అభివర్ణిస్తారు. కానీ ఇపుడా యప్ టీవీ సొంతంగా సీరియల్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ నిర్మాణమూ పూర్తయింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కూడా! ‘‘అంతేకాదు!! తొలిసారిగా ఓ స్పోర్ట్స్ చానెల్, ఓ తెలుగు చానెల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకుంటున్నాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి’’ అంటూ తమ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ గురించి యప్ టీవీ ఫౌండర్ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... యప్కు బీజం ఇలా..: నోర్టెల్ నెట్వర్క్స్, సిమెన్స్ వంటి టెలికం కంపెనీల్లో దశాబ్ద కాలంపైనే పనిచేశా. టెలికం బూమ్‌తో విధుల నిమిత్తం చాలా దేశాలు తిరిగా. ఎక్కడికెళ్లినా నాకెదురైన ప్రధాన సమస్య.. అక్కడి టీవీల్లో మన భాషలోని చానెల్స్ రాకపోవటమే! టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఇదేంటని అనిపించేది. అదే యప్ టీవీ పునాదికి బీజం వేసింది. సాంకేతికత అభివృద్ధి, దక్షిణాది చానెల్స్‌తో ఒప్పందాలు, మార్కెటింగ్ కోసం మూడేళ్లు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో జార్జియా ప్రధాన కేంద్రంగా 2006లో యప్ టీవీని ఆరంభించాం. ఒక్క మాటలో... స్థానిక భాషల్లోని టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని వాటి కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌లోనైనా చూసుకునేదే యప్ టీవీ. 250 చానెల్స్; 25 వేల గంటల కంటెంట్..: ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లోని 250 టీవీ చానల్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. వీటిలో 102 వినోద చానెల్స్, 16 సినిమా, 30 మ్యూజిక్, 85 న్యూస్, 40 ఆధ్యాత్మిక చానెళ్లున్నాయి. వాటి కార్యక్రమాలు లైవ్ లేక రికార్డింగ్వి యప్ టీవీలో చూసుకోవచ్చు. ప్రస్తుతం మా టీవీలో 25 వేల గంటల నిడివి గల వీడియో కంటెంట్ ఉంది. సినిమాల కోసం యప్ ఫ్లిక్స్, షార్ట్ ఫిల్మ్సŠ, వెబ్ సీరియల్స్ కోసం యప్ బజార్ ఉన్నాయి. నెలకు రూ.99; వీక్షకులు 50 లక్షలకు పైనే ప్రస్తుతం ట్యాబ్లెట్స్, పీసీ, స్మార్ట్‌ఫోన్స్ ఇలా 27 రకాల డివైజ్‌ల ద్వారా... అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా, న్యూజిలాండ్, కరేబియన్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన 50 లక్షల మంది యప్ టీవీని చూస్తున్నారు. నెలకు చందా ధర రూ.99. అమెరికాలో అయితే నెలకు 20 డాలర్లు. ఇందులో 65–70 శాతాన్ని చానల్స్‌కు చెల్లిస్తాం. మిగిలింది మా ఆదాయం. ప్రస్తుతం 80 లక్షల యప్ టీవీ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి... 2017 ముగింపు నాటికి రూ.350 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా చేరుకున్నాం. ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.680 కోట్లు సమీకరించాం. గత అక్టోబర్‌లో అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ ఎమరాల్డ్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇటీవల అమెరికన్ రిలైబుల్ ఐపీటీవీని సబ్స్క్రిప్షన్ విధానంలో కొన్నాం. అవకాశముంటే విదేశాల్లోని చానల్స్‌నూ కొనుగోలు చేస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు.. హైదరాబాద్‌లో స్థానిక నటులతో ఒక సీరియల్ తీస్తున్నాం. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో... తర్వాత మరాఠీ, బెంగాలీలో ప్రసారం చేస్తాం. 2017 ముగింపు నాటికి 20–25 ప్రోగ్రామ్స్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో ఒక స్పోర్ట్స్ చానల్, తెలుగు చానల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఈ అవకాశం ముందుగా అమెరికా సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే ఇస్తాం.