breaking news
live interview
-
లైవ్: అమ్మా, ఆ యాంకర్ పేరేంటి?
లండన్: కరోనా కారణంగా అన్ని పనులు ఇంటి నుంచే పూర్తి చేసుకుంటున్నాం. ఉద్యోగానికి కూడా గడప దాటాల్సిన పరిస్థితి లేకుండా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అయితే పిల్లలు ఉన్న ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి తల ప్రాణం తోకకొస్తుంది. ముఖ్యంగా టీవీ జర్నలిస్టులకు ఇది మరింత కష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ డిబేట్లలో పాల్గొనే వారు కూడా ఇంటి నుంచే లైవ్‌లో వీడియో ద్వారా చర్చిస్తున్నారు. (పోలీసులకు ఫోన్: పిచ్చిపట్టిన దానిలా..) ఈ క్రమంలో ఓ వాతావరణ యాంకర్.. వెదర్ అప్డేట్స్ ఇస్తున్న సమయంలో పిల్లి రావడం, మరో యాంకర్ ఇంటి నుంచే లైవ్ చేస్తుండగా, ఆమె భర్త అర్ధ నగ్నంగా దర్శనమివ్వడం.. ఇలాంటి ఎన్నో వింతలు చూడాల్సి వచ్చింది. తాజాగా బీబీసీ లైవ్‌లో పాల్గొన్న జర్నలిస్టుకు కూడా ఇలాంటి ఇబ్బందికర ఘటన ఎదురైంది. డా. క్లేర్ వెన్హామ్ అనే నిపుణురాలు ఇంగ్లాండ్‌లో లాక్డౌన్ పరిస్థితిపై లైవ్‌లో సీరియస్‌గా చర్చిస్తోంది. ఇంతలో ఆమె కూతురు ఇంటర్వ్యూలో ప్రత్యక్షమైంది. (యాంకర్ రవి 'తోటబావి' టీజర్) అమ్మను పిలుస్తూ డ్రాయింగ్ ఫొటో ఎక్కడ పెట్టాలంటూ చూపించసాగింది. ఇదేవీ పట్టించుకోకుండా ఆమె చెప్పుకుపోతూ ఉండగా ఆ చిన్నారి మళ్లీ తల్లిని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సైలెంట్‌గా ఉండు అంటూ కూతురికి సైగ చేసినా ఆ చిన్నారి అల్లరి ఆపడం లేదు. దీంతో బీబీసీ యాంకర్ క్రిస్టియన్ ఫ్రాజర్ స్పందిస్తూ.. "మీ కూతురు పేరేంటి?" అని అడిగాడు. అందుకు ఆమె పెదాలపై చిరునవ్వుతో 'స్కార్లెట్' అని సమాధానమిచ్చింది. అనంతరం ఫ్రాజర్ ఆ డ్రాయింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పి, అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. అప్పుడు ఆ పాప కూడా లైవ్‌లో కనిపిస్తున్న యాంకర్‌ను చూస్తూ.. "అతని పేరేంటి అమ్మా?" అని అడిగింది. దీనికి యాంకర్ "నా పేరు క్రిస్టియన్" అంటూ వినయంగా సమాధానమిచ్చాడు. ఈ వీడియోను బీబీసీ యూకే ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. లైవ్‌లో యాంకర్ ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు అబ్బురపడుతున్నారు (వైరల్: మనసు మార్చుకున్న దొంగలు!) “Mummy what's his name?” Dr Clare Wenham, we understand your struggles of working from home and looking after children 😂https://t.co/vXb15EQatL pic.twitter.com/4f3PODtJWA — BBC News (UK) (@BBCNews) July 1, 2020 -
లైవ్‌లో చిచ్చరపిడుగు హల్చల్!
-
లైవ్ ఇంటర్వ్యూలో చిచ్చరపిడుగు హల్చల్!
పిల్లలతో వ్యవహారం అంత ఆషామాషి కాదు. ఈ విషయం బీబీసీ న్యూస్ చానెల్‌కు బాగా అర్థమై ఉంటుంది. మంగళవారం ఉదయం బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ లైవ్ బులిటెన్‌లో ఓ చిన్నారి చిచ్చరపిడుగు హల్చల్ చేశాడు. దీంతో లైవ్ కార్యక్రమంతా రసాభాసను తలపించింది. బ్రిటన్ ష్ర్యూబరీకి చెందిన నాలుగేళ్ల హ్యారీ మెషియాచెన్ మంగళవారం తల్లి క్లారాతో కలిసి బీబీసీ లైవ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హ్యారీకి అరుదైన కాలేయ వ్యాధి ఉంది. మొదటి పుట్టినరోజుకు ముందే అతనికి కాలేయ మార్పిడి జరిపారు. మరోసారి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరుపాల్సి ఉంది. ఈ విషయమై మాట్లాడేందుకు బీబీసీ ప్రజెంటర్లు లూయిస్ మించిన్, బిల్ టర్నబుల్ హ్యారీని, అతని తల్లిని స్టూడియోకు పిలిచారు. వారితో గంభీరంగా లైవ్ ఇంటర్వ్యూను నిర్వహించేందుకు వారు నానా తంటాలు పడ్డారు. కానీ తుంటరి హ్యారీ వింటే కాదు. కార్యక్రమం పొడుగుతా అతను అల్లరి చేస్తూనే ఉన్నాడు. తాను కూర్చున్న సోఫాపై పిడిగుద్దులు కురిపించాడు. బిగ్గరగా నవ్వుతూ చిన్నారి హ్యారీ హల్చల్ చేశాడు. ఎదురుగా కనిపిస్తున్న మానిటర్లో ఒక్కసారిగా తనను చూసుకోవడంతో హ్యారీ ఆనందం కట్టలు తెగింది. కార్యక్రమం మొత్తం అతను బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు. తల్లి అతన్ని బుద్ధిగా కూర్చొబెట్టేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. తొలిసారిగా తనను తాను టీవీలో చూసుకోవడంతో హ్యారీ ఆనందంతో ఇలా ప్రవర్తించాడని తల్లి వివరించింది. ఆకుపచ్చ టీ షర్ట్‌లో చూడటానికి ముద్దుగా ఉన్న హ్యారీ చేసిన అల్లరి న్యూస్ ప్రజెంటర్లకు చికాకు తెప్పించినా.. కార్యక్రమాన్ని వీక్షించినవారికి మాత్రం హ్యారీ తెగ ముద్దొచ్చేశాడట.