breaking news
Limited (RIL)
-
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
మరికొద్ది సేపట్లో రిలయన్స్ సంచలనం?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టనుందనే అంచనాలు భారీ గా నెలకొన్నాయి. గురువారం ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన 40వ (ఏజీఎం) వాటాదారుల సాధారణ వా ర్షిక సమావేశం జరుగుతోంది. అనంతరం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో ఎలాంటి ప్రకటనలతో ముందుకు రానున్నారనే ఆసక్తి, ఉత్కంఠ ఈ సందర్భంగా మార్కెట్ వర్గాల్లో, ఖాతాదారుల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రిలయన్స్ జియో మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం కంపెనీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉచిత వాయిస్, డేటా సేవలకు నాంది పలికిన జియో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది. తాజా ఏజీఎంలో జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు దూరం చేసే మరో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆ కంపెనీ నుంచి రానున్న రూ.500 .1000 4జీ ఫీచర్ ఫోన్‌ను ఈ సమావేశంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. అలాగే సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అటు రిలయన్స్ ప్రకటించిన ఫలితాల నేపథ్యంలో ఎనలిస్టులు కూడా ఆర్ఐఎల్ పై సానుకూలంగా ఉన్నారు. ప్రధానంగా రిఫైనింగ్ పెట్రో కెమికల్ బిజినెస్ లో ఆర్ఐఎల్ సాధించిన పురోగతి ఈ షేరును కొత్త రికార్డు స్థాయిలకు చేర్చనుందని భావిస్తున్నారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాల్లో 28 శాతం జంప్ చేసి 9,108 కోట్లకు చేరింది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న బాలాజీ టెలిఫిలిమ్స్లో రూ. 403 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రూ. 403 కోట్ల పెట్టుబడితో బాలాజీ టెలిఫిలిమ్స్లో 24 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ. 164/ షేర్ చొప్పున 2.5 కోట్ల షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేసేందుకు బాలాజీ టెలిఫిలిమ్స్ సిద్ధమైంది. అలాగే బాలాజీ టెలిఫిలిమ్స్లో రిలయన్స్‌కు చెందిన ఇద్దరికి బోర్డు సభ్యత్వం లభించనుంది. ఈ డీల్ తర్వాత బాలాజీ టెలిఫిలిమ్స్ ప్రమోటర్ వాటా 32 శాతానికి తగ్గనుంది. అలాగే రిలయన్స్ జియో రూ. 20 వేల కోట్ల రైట్స్ ఇష్యూకు రాబోతోన్న సంగతి తెలిసిందే.