breaking news
letter to centre
-
నేవీ చీఫ్ లేఖపై కేంద్రంలో కదలిక
సాక్షి,న్యూఢిల్లీ: అమర జవాన్ల పిల్లల విద్యపై వెచ్చించిన మొత్తం రీఎంబర్స్‌మెంట్‌పై పరిమితిని సమీక్షించాలని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం సైనికుల పిల్లల విద్యపై నెలకు రూ 10,000 వరకూ మాత్రమే గరిష్టంగా రీఎంబర్స్మెంట్ కోరేందుకు పరిమితి విధించారు. ఈ ఏడాది జులైలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వంపై త్రివిధ దళాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడవ వేతన సంఘ సిఫార్సుల్లో భాగంగా ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్‌పై పరిమితి విధించింది. అంతకుముందు అమర జవాన్లు, వికలాంగులైన సైనికుల పిల్లల ట్యూషన్ ఫీజును స్కూళ్లు, కాలేజీలు సహా వృత్తి విద్యా సంస్ధల్లో పూర్తిగా మాఫీ చేసేవారు. ఈ అంశాన్ని నేవీ చీఫ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో తన నిర్ణయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్షించే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం సాయుధ బలగాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
తొలిసారి ఇద్దరు సీఎస్ల ఉమ్మడి లేఖ
అఖిలభారత సర్వీసు ఉద్యోగుల విభజనపై ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కలిసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. తొలిసారి ఇద్దరు సీఎస్‌లు కలిసి ఉమ్మడిగా లేఖ రాస్తున్నారు. ఉన్నతాధికారుల విభజన జరగకపోవడం వల్ల పాలన స్తంభించిందని, రెండు రాష్ట్రాల్లో పాలన గాడిలో పడాలంటే తక్షణమే అధికారుల విభజన జరగాలని ఆ లేఖలో చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల విభజన బాగా ఆలస్యమైందని, అధికారులకు ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాళ్లను మినహాయించి ఎలాంటి సమస్యలు లేని వాళ్లను వెంటనే ఇరు రాష్ట్రాలకు పంపాలని రాశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఉమ్మడి లేఖ వెళ్లింది. రెండు మూడు రోజుల్లో ఈ లేఖ కేంద్రానికి చేరుతుంది.