breaking news
lethargy
-
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్‌రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్‌రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు -
ఆ బద్ధకాన్ని వదిలించే బ్యాక్టీరియా మందు!
ఉదయం నిద్ర లేవగానే కడుపు కదలకపోతే.. మనలో చాలామందికి అదో వెలితి. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితముండదు. ఇలాంటి అన్ని రకాల మలబద్ధకం సమస్యలకు తాము ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నామని అంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. ట్రైప్టామిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసేలా ఓ బ్యాక్టీరియాలో జన్యుమార్పులు చేయడం ఈ కొత్త పద్ధతిలోని విశేషమని పూర్ణ కశ్యప్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి సాధారణంగా డాక్టర్లు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, లేదంటే ప్రోబయాటిక్లు తీసుకోవాలని సూచిస్తూంటారని, అయితే మన పేవుల్లో ఉండే సూక్ష్మజీవి ప్రపంచం ఎవరికి వారిదే ప్రత్యేకమైంది కాబట్టి చాలా సందర్భాల్లో డాక్టర్ల సూచనలు పనిచేయవని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ట్రైప్టామిన్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టామని ఈ రసాయనం మన పేవుల్లో ఉత్పత్తి అయ్యే సెరెటోనిన్‌ను పోలి ఉంటుందని చెప్పారు. ఎలుకల్లో ఈ బ్యాక్టీరియాను జొప్పించినప్పుడు వాటి పేవుల్లో ద్రవాలు ఎక్కువగా స్రవించాయని, ఫలితంగా ఆహారం తొందరగా కదలడంతోపాటు ఆ సమస్య కూడా తీరిందని ఆయన వివరించారు. పైగా తాము ఎంచుకున్న బ్యాక్టీరియా అక్కడికక్కడే నశించిపోతుంది కాబట్టి దుష్ప్రభావాలు ఏమీ ఉండవని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో ఈ కొత్త బ్యాక్టీరియా వైద్యం అందుబాటులోకి రావచ్చునని అంచనా. -
హోలీ వేళ ఈ జాగ్రత్తలు తీసుకోండి
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 88 ఏళ్లు. ఈమధ్య నాకు మల బద్ధకం సమస్య ఎక్కువైంది. మలవిసర్జన తర్వాత విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌గారు పరీక్షించి ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - గోపాల్‌రావు, కోదాడ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. నిత్యం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల శాతం తగ్గడం వల్ల మలబద్ధకం వస్తుంది. దాంతో మలవిసర్జన కష్టమవుతుంది. మలవిసర్జన సజావుగా జరగనప్పుడు ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడటాన్ని ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి మలద్వార సమస్యలు వస్తున్నాయి. మలబద్ధకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్ధకం ఎక్కువకాలం విరేచనాలు వంశపారంపర్యం అతిగా మద్యం తీసుకోవడం ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట చురుకుగా ఉండలేరు చిరాకు, కోపం విరేచనంలో రక్తం పడుతుంటుంది కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ హోమియో చికిత్స: ఫిషర్‌తో బాధపడుతున్న వారికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. దీంతో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం అవుతుంది. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. ఈ సమస్యకు నక్స్‌వామికా, నైట్రస్ యాసిడ్, సల్ఫర్ వంటి మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ స్కిన్ కౌన్సెలింగ్ హోలీ వేడుకలో మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు... రంగులు పూసుకునే ముందు మీజుజీ ముఖంపైన, చర్మంపైన కాస్త హెయిరాయిల్గానీ లేదా కొబ్బరినూనెగాని పూసుకోండి. దీని వల్ల ఆ తర్వాత రంగులు తేలిగ్గా వదులుతాయి. సాధ్యమైనంత వరకు పొడిగా ఉండే గులాల్ వంటి రంగులను వాడండి. నేరుగా ఎండలో హోలీ ఆడకండి. ఆ సమయంలో మనకు దాని ప్రభావం తెలియకపోవచ్చు. కానీ దాని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. హోలీ ఆడే సమయంలో ఎస్పీఎఫ్ 50 ప్లస్ ఉండే వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ వాడండి. కేవలం స్వాభావికమైన రంగులనే (నేచురల్ కలర్స్) వాడండి. కొందరు ఆటలోని జోష్‌లో పెదవులకు సైతం రంగు పూసుకోవచ్చు. దీనివల్ల అది నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. హోలీ వేడుకలు పూర్తి అయిన వెంటనే ఒళ్లంతా శుభ్రమయేలా స్నానం చేయండి. రంగులు తేలిగ్గా వదిలిపోయేందుకు ముందుగా నూనె పూసుకోండి. రంగులు వదిలించుకునే ప్రయత్నంలో చాలా కఠినంగా ఉండే సబ్బులు లేదా డిటర్జెంట్ సబ్బులను ఉపయోగించవద్దు. కేవలం జంటిల్ సోప్స్ మాత్రమే వాడండి. స్నానం తర్వాత ఒళ్లంతా ముద్దగా అయపోయేలా షియా బటర్ ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోండి. పొడి రంగులు వాడే సమయంలో అవి కళ్లలోకి పోకుండా జాగ్రత్త పడండి. వేడుకల తర్వాత ఒంటిపై దద్దుర్లు లేదా ఎర్రమచ్చలు, చర్మంపై అలర్జీ వంటివి వస్తే తప్పక డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నాకు డస్ట్ అలర్జీ ఉంది. హోలీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వినోద్, హైదరాబాద్ హోలీ వేడుకల్లో ఉపయోగించే పొడి రంగుల వల్ల డస్ట్ అలర్జీతో కనిపించే దుష్ర్పభావాలే కనిపించవచ్చు. ఈ పౌడర్స్ వల్ల హోలీ సమంలో వాడే రంగుల వల్ల అలర్జిక్ రైనైటిస్ ఉన్నవారిలో ముక్కునుంచి స్రావాలు కారుతుంటాయి. రంగుల పండుగ సందర్భంగా వాడే పొడి రంగులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల కలిగే అలర్జీ... ‘ఆస్తమా’ను ప్రేరేపించవచ్చు. ఒక్కోసారి మనకు సరిపడని పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు గాలిపీల్చుకునేందుకు దోహదపడే ఊపిరితిత్తుల నాళాలు సన్నబడిపోయి గాలి స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదపడకుండా అడ్డుపడతాయి. దీన్నే అలర్జీగా చెప్పవచ్చు. అలర్జీ వల్ల కళ్లు ఎర్రబారడం కూడా కొందరిలో కనిపిస్తుంది. ఇక ఆస్తమా రోగుల్లో మ్యూకస్ ఎక్కువగా, చిక్కగా స్రవించి శ్వాసనాళానికి అడ్డుపడుతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం జరగవచ్చు. ఆస్తమా మొదలు కాగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. శ్వాస కొద్దిగా అందేలోపే ఛాతీ గట్టిగా బిగదీసుకుపోయి పట్టేసినట్లుగా ఉండటం. తీవ్రమైన ఆయాసం దగ్గు శ్వాస తీసుకునే సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఇతర లక్షణాలు: ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని అదనపు లక్షణాలూ కనిపించవచ్చు. అవి... ముక్కులు బిగదీసుకుపోవడం, సైనుసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కనిపించడం, కొందరిలో ఒంటిపై దద్దుర్లు (ర్యాషెస్), చర్మంపై పగుళ్లు (డర్మటైటిస్) వంటివీ కనిపించవచ్చు. హోలీ వేడుకల్లో ఆడే రంగువల్ల ఆస్తమా కలిగితే అది ప్రాణాపాయానికీ దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆస్తమా వ్యాధి చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉన్నవారు ఈ వేడుకలకు దూరంగా ఉండటమే మంచిది. ఇక వ్యాధిగ్రస్తులు తాము వాడే ఇన్హేలర్ వంటి ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇది తగ్గకపోతే వెంటనే డాక్టరును సంప్రదించాలి. వారి పర్యవేక్షణలో తక్షణమే ఆస్తమా అటాక్‌ను తగ్గించే మందులు, దీర్ఘకాలంలో యాంటీహిస్టమైన్ వంటి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
నిద్రమత్తు వదిలించే...తాడాసనం
వ్యాయామం ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా ఉండి నిద్రమత్తు వదలకపోతే రెండు నిమిషాల పాటు ఈ ఆసనాన్ని సాధన చేస్తే చాలు. దేహం చైతన్యవంతమై రోజంతా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఎలా చేయాలి? రెండుపాదాలను దగ్గరగా ఉంచి, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాచి నిటారుగా నిలబడాలి. రెండు చేతులను అలాగే పైకి తీసుకుని వ్రేళ్లలో వ్రేళ్లు చొప్పించాలి(ఇంటర్‌లాక్). ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులనూ ఆకాశం చూస్తున్నట్లుగా పైకి లాగాలి. అదే సమయంలో కాలి మునివేళ్లపైన శరీర బరువు ఉంచి దేహాన్ని లాగినట్లుగా పైకి లేపాలి. ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉండి, ఆ తర్వాత నిదానంగా రెండు అరచేతులను తల పైన బోర్లించి రెండు పాదాలను నేల పైన ఉంచాలి. ఇలా మూడుసార్లు చేస్తే చాలు. రోజును ఉత్సాహంగా గడిపేయవచ్చు. ఇతర ప్రయోజనాలు: ఎముకలు, కండరాలు చైతన్యవంతం అవుతాయి. కాలివేళ్లు, మడమలు, మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు, చేతివేళ్లు శక్తిమంతం అవుతాయి. ఈ ఆసనం ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్త: మోకాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. భుజాల కీళ్లు అరిగిపోయిన వాళ్లు కూడా చేయకూడదు.