breaking news
less rush
-
తొలిరోజు 4లక్షల మంది పుష్కర స్నానాలు
విజయవాడ: పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ఘాట్ల వద్ద 4లక్షల మంది పుష్కర స్నానమాచరించినట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్బంగా భక్తుల రద్దీ తక్కువగా ఉందని, రేపటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఉండడంతో భక్తల రద్దీ పెరుగుతుందనుకుంటున్నామని ఆయన తెలిపారు. -
కొండపై తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శ్రీవారి దర్శనానికి బుధవారం 7 గంటల సమయం పడుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 36,338 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా 13 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి 7 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న కాలినడక భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని చెప్పారు. కాగా, బుధవారం శ్రీవారి హుండీ లెక్కింపుల్లో (మంగళవారం భక్తులు సమర్పించినవి) ఆదాయం రూ.2.38 కోట్లు లభించింది.