breaking news
Legislative Council Deputy Chairman
-
మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్‌కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు పాటించాలి’ అని చురకలు అంటించారు. -
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్: నేడు బండా ప్రకాష్ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బండా ప్రకాశ్‌లో శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎం కేసీఆర్.. పార్టీ నాయకులకు సూచించారు. -
మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యం
సాక్షి, అమరావతి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ఎ.చక్రపాణి వెల్లడించారు. సభ వ్యవహారాల్లో ఆయన రాజ నీతిజ్ఞతతో గౌరవ సభ్యుల మన్నలను పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో టీడీపీకి చెందిన రెడ్డి సుబ్రమణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ లోకేశ్ మాట్లాడుతూ పెద్దల సభలో ప్రభుత్వానికి మంచి సూచనలు, అభిప్రాయాలు ఇస్తూ సభా గౌరవాన్ని కాపాడుతున్నారని ప్రతిపక్ష పార్టీ సభ్యులను అభినందించారు. రెడ్డి సుబ్రమణ్యం తమ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎనలేని సేవ చేశారని అలాంటి వ్యక్తి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. శాసన మండలికి కొత్త రూపు: శాసన మండలికి కొత్త రూపు వచ్చినట్లైంది. ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య సహా 14 మంది సభ్యుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ సహా కొత్త సభ్యులు అడుగుపెట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత పదవీకాలం ముగియడంతో ఆ అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. హెరిటేజ్‌కు లోకేశ్ రాజీనామా: త్వరలో మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్లో తెలిపిన ఆయన తొమ్మిదేళ్ల హెరిటేజ్ ప్రయాణంలో అనేక విజయాలు సాధించడం తృప్తినిచ్చిందన్నారు.


