breaking news
leave applications
-
‘లవ్’ లీవ్ కావాలి!
అది చలికాలం మధ్యాహ్నం.. ఢిల్లీలోని ఒక కార్పొరేట్ కార్యాలయం.. అందరూ మధ్యాహ్న భోజనం తర్వాత పనిలోకి జారుకుంటున్న వేళ.. ఓ కుర్ర ఉద్యోగికి మాత్రం మనసు మనసులో లేదు. ఎందుకంటే.. డిసెంబర్ 17న అతని గర్ల్‌ఫ్రెండ్ స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు వెళ్తోంది. మళ్లీ వచ్చేది జనవరి మొదటి వారంలోనే.. ఈ సుదీర్ఘ వియోగానికి ముందు ఆమెతో ఒక రోజు మొత్తం గడపాలి.. కానీ ఎలా?.. ఎలా? మేనేజర్‌కి ఏం చెప్పాలబ్బా..! సమస్య అల్లా మేనేజర్ వీరెన్ ఖుల్లర్.. సెలవు అడిగితే రొటీన్ సాకు చెప్పాలా? ’మామయ్యకి సుస్తీ’, ’ట్రైన్లో టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు’.. లాంటి పాత ట్రిక్స్ వాడాలా? ఇవేవీ వద్దనుకున్నాడు మన లవర్‌బాయ్.. ఎందుకంటే, నిజాయితీనే అతిపెద్ద ఆయుధమని అతనికి తెలుసు. ఈమెయిల్ బాంబు.. మొత్తానికి అబ్బాయి.. ధైర్యం చేశాడు. కీబోర్డుపై వేళ్లు ఆనించి ఒక పారదర్శకమైన ఈమెయిల్‌ను టైప్ చేసేశాడు. అందులో ఎలాంటి అతిశయోక్తులు.. అలంకారాలు లేనేలేవు. సూటిగా చెప్పేశాడు.. ‘డిసెంబర్ 16న వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కావాలి, ఎందుకంటే నా గర్ల్‌ఫ్రెండ్ తన సొంతూరు ఉత్తరాఖండ్‌కు డిసెంబర్ 17న వెళ్తోంది. జనవరి మొదటి వారం వరకు తిరిగి రాదు. అందుకే ఆమె వెళ్లే ముందు ఆ ఒక్కరోజు తనతో గడపాలని కోరుకుంటున్నాను..’ఇదీ సెలవు దరఖాస్తు సారాంశం. ఆ మెయిల్ ’సెండ్’ బటన్ నొక్కిన క్షణం.. ఆఫీసులో కాదు, కుర్రాడి గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వీడు మామూలోడు కాదు మేనేజర్ వీరెన్ ఖుల్లర్ మధ్యాహ్న భోజనం తర్వాత ఈమెయిల్స్ పరిశీలిస్తుండగా, ఆ అసాధారణమైన ’లవ్ రిక్వెస్ట్’ కంట పడింది. ఖుల్లర్ ముఖంలో చిరునవ్వు, ఆశ్చర్యం కలగలిసిన భావం. ‘ఓహో! పాత రోజుల్లో అయితే వీడు ఉదయం 9.15 గంటలకే ’ఫీవర్’ అని మెసేజ్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ధైర్యం!‘ అనుకున్నారు. నిజానికి, గతంలో ఇలాంటి రిక్వెస్ట్‌లు రాత్రికి రాత్రి ’జబ్బు’గా మారి, మర్నాడు ఉదయం అపాయింట్మెంట్ అడిగేవి. కానీ కుర్రాడి నిజాయితీ, పారదర్శకత బాస్‌కి తెగ నచ్చేశాయి. ప్రేమకు జై.. ఈ పోస్ట్ తక్షణం వైరల్ అయింది. నెటిజన్లు కుర్రాడి ధైర్యాన్ని, ఖుల్లర్ ఔదార్యాన్ని చూసి మనసారా మెచ్చుకున్నారు. ‘అసలైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇదే!’, ‘ఆ మేనేజర్‌కి సలామ్’, ‘సెలవు దొరకడమే కష్టం అనుకుంటే, ప్రేమ పేరుతో దొరకడం అంటే లక్’.. అంటూ ప్రశంసించారు. ఆఫీసు అంటే కేవలం కట్టుబాట్లు, కఠిన నియమాలు కాకుండా, నమ్మకం, మానవత్వం కూడా ఉంటాయని ఈ చిన్న సంఘటన నిరూపించింది. ప్రేమోద్యోగి కథ సుఖాంతమైంది. అతను తన ప్రేయసితో హ్యాపీగా గడిపేందుకు టిక్కెట్ సంపాదించాడు. బేబీ ప్రేమ విషయంలో, బాసు కూడా ఓడిపోక తప్పలేదు! పండగ చేస్కోరా బుడ్డోడా..అప్పుడే మేనేజర్ ఖుల్లర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ క్షణికావేశంలో, తాను ఒక డైరెక్టర్ కాదు, కేవలం ఒక మనిషి మాత్రమే అని గుర్తు చేసుకున్నాడు. మనిషి జీవితంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన గౌరవించాడు. సెలవు మంజూరు చేస్తూ.. ఆ మహా ప్రేమ లేఖ స్క్రీన్‌షాట్‌ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. దానికి ఆయన జత చేసిన వ్యాఖ్యే ఈ కథకు ’పంచ్’ పాయింట్.. ‘ప్రేమకు ’నో’ చెప్పే ధైర్యం మనకు ఎక్కడిది? సెలవును ఆమోదించాను! నువ్వు హ్యాపీగా వెళ్లు తమ్ముడూ!’.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
‘నా భార్య అలిగి వెళ్లిపోయింది..3 రోజులు లీవ్ ఇవ్వండి సార్’
లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగింది. ప్రేమ్ నగర్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్ అహ్మెద్. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్. క్లర్క్ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు. Kanpur man seeks leave to make amends with wife, letter goes #viral pic.twitter.com/4RmVvL2JQh — Aaquil Jameel (@AaquilJameel) August 3, 2022 ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా! -
అడుక్కోవడానికి వెళ్లాలి.. ఆదివారం సెలవివ్వండి: ఇంజనీర్
భోపాల్: సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనే.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెడతాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ లీవ్లెటర్ని చూస్తే.. ఇదేందిరా భయ్ ఇలాంటి వాటికి కూడా సెలవు అడుగుతారా అనిపిస్తుంది. ఆ వెరైటీ లీవ్‌లెటర్ వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ యాదవ్ ఈ వింత లీవ్ లెటర్ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా అని రాజ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు.. అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. (చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’) వారిని షాక్‌కు గురి చేసిన ఆ సమాధానం ఏంటంటే.. తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నాని తెలిపాడు. అంతేకాక తనలోని అహాన్ని చెరిపివేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్‌కుమార్. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పూర్వ జన్మలో రాజ్‌కుమార్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్ భగవత్ శకుని మామ అట. గత జన్మలో వీరు ఇద్దరు రాజ్‌కుమార్ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. (చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..) ఇక ఈ లేఖ చదివిన రాజ్‌కుమార్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, “ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’’ అని రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్ లెటర్‌పై నెటిజనులు ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. In Agar Malwa of Madhya Pradesh, a sub-engineer has written a leave application to his superior saying that he gained recollection of his past life and wanted to do Bhagavad Gita paath to know more about his life & also beg alms to erase ego every Sunday pic.twitter.com/qOmMpyZB9j — ANI (@ANI) October 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం -
లీవ్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే
బలరామ్‌పూర్ : మనకు ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఏం చేస్తాం ! వెంటనే మెయిల్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో సమాచారాన్ని అందిస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీసులు మాత్రం తమకు లీవ్ కావాలంటే దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ వర్మ కోరారు. బలరాంపూర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అందుకోసం ప్రతిరోజు వీలైనన్ని ఇంగ్లీష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. తన ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పలువురు పోలీసు అధికారులు డిక్షనరీలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 'ఈ నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. సైబర్ క్రైమ్, నిఘా సంస్థల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. మా పోలీసులకు ఇంగ్లీష్ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తేలింది. అందుకే మా పోలీసులు ఇంగ్లీష్ మీద కనీస అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సెలవు కావాలంటే దరఖాస్తును తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలన్న కండీషన్ పెట్టినట్లు' ఎస్పీ రంజన్ వర్మ చెప్పుకొచ్చారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రంజన్ వర్మ విధుల్లో చేరినప్పటి నుంచి తాను పని చేసిన ప్రతీ చోట ఇంగ్లీష్‌ను నేర్చుకోవాలనే నిబంధనను అమలు చేసేవారు. ' ఇప్పుడిప్పుడే మా కానిస్టేబుళ్లు గూగుల్ సహాయంతో తమ లీవ్‌కు సంబంధించిన దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే చేసుకుంటున్నారని, ఇది ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో అమలు అయ్యే విధంగా చూస్తానని' ఆయన తెలిపారు. రంజన్ వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు దీన్ని అమలు చేసే విషయమై సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు లక్నోకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. -
హైకోర్టు అనుమతి లేకుండా సెలవు తీసుకోవద్దు!
హైదరాబాద్: న్యాయాధికారుల సెలవులకు సంబంధించి జిల్లా జడ్జీలు, మెట్రోపాలిటన్ జడ్జీల అధికారాలను బుధవారం హైకోర్టు ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతి తీసుకోకుండా ఏ న్యాయాధికారి సెలవు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా సెలవు కోరితే ఆ న్యాయాధికారుల సెలవు దరఖాస్తులు కోర్టుకు మెయిల్ చేయాలని రెండు రాష్ట్రాల న్యాయాధికారులను హైకోర్టు ఆదేశించింది.


