breaking news
Leander Paes (Tennis player)
-
గృహహింస కేసులో దోషిగా లియాండర్ పేస్..
గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రియా పిళ్లై తన భాగస్వామి అయిన లియాండర్ పేస్ ఇంటిని విడిచి వెళ్లాలి అనుకుంటే. .తనకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అద్దె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని పేస్‌ను కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా తాము ఇద్దరం లివ్ఇన్ రిలేషన్లో ఉన్నామని.. పలు సార్లు పేస్ గృహ హింసకు పాల్పడ్డాడని రియా పిళ్లై ఆరోపించింది. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిళ్లై 2014లో కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడించింది. చదవండి: ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను' -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: లియాండర్ పేస్ (టెన్నిస్ క్రీడాకారుడు),అమృతారావ్ (నటి, మోడల్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. వీరికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. మంచి భావవ్యక్తీకరణ, వాక్పటిమ కలిగి ఉండటం వల్ల ప్రతి అంశాన్నీ తమకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు. రాహుగ్రహ ప్రతికూలత వల్ల కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మొండిగా ప్రవర్తించకుండా, సామరస్య ధోరణి అవలంబించడం మంచిది. అవివాహితులకు ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించక పోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: నవగ్రహారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, అనాథలను, వృద్ధులను ఆదరించడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు