బక్కచిక్కిపోయిన రవితేజ హీరోయిన్
తెలుగు హీరోయిన్లు చాలావరకు స్ట్రిక్ట్ డైట్ మెంటైన్ చేస్తుంటారు. తమిళ-మలయాళ బ్యూటీస్ మాత్రం కొందరికి ఇందులో మినహాయింపు అని చెప్పొచ్చు. బొద్దుగా ఉన్నా సరే తమకు తగ్గ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి హీరోయిన్ ఒకరు ఇప్పుడు షాకింగ్ లుక్ లో కనిపించింది.మలయాళ ఇండస్ట్రీకి చెందిన రజిష విజయన్.. 2019 నుంచి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ రవితేజ 'రామారావ్ ఆన్ డ్యూటీ'లో హీరోయిన్ గా చేసింది. సర్దార్, కర్ణన్, జై భీమ్ లాంటి డబ్బింగ్ చిత్రాలతోనూ ఈమె మనకు పరిచయమే. (ఇదీ చదవండి: స్కిట్ వివాదం.. యాంకర్ రవి మరో వీడియో) గత కొన్నేళ్లుగా బొద్దుగా కనిపించిన రజిష... గత ఆరు నెలల నుంచి జిమ్ చేస్తూ దాదాపు 15 కిలోల మేర బరువు తగ్గింది. ఈ విషయాన్ని ఆమె జిమ్ కోచ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. సాధారణ ఆహారం తీసుకుంటూనే ఇలా మారిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే రజిష కాలికి ఎన్నో గాయాలు కూడా అయ్యాయని ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు.ఇదంతా కూడా రజిష చేస్తున్న ఓ సినిమా కోసమేనని, త్వరలో దాని గురించి ప్రకటన ఉంటుందని సదరు జిమ్ కోచ్ రాసుకొచ్చాడు. ఇక ఫొటోల్లో రజిషని చూస్తే మాత్రం మరీ ఇంత బక్కచిక్కిపోయిందేంట్రా బాబు అనిపించక మానదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) View this post on Instagram A post shared by Ali Shifas | ACSM CPT (@ali_shifas_vs)