breaking news
Lashkar activities
-
పాక్ మద్దతు.. భారత్‌లో మరో ఉగ్రదాడి?
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ మద్దతుతో పలు ఉగ్రవాద సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారవర్గాలకు సమాచారం అందిందని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన దరిమిలా పాక్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం)లు కొత్తగా సమన్వయ దాడులకు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం గత సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు భారత్‌లోకి చొరబాట్లు, నిఘా, సరిహద్దు లాజిస్టిక్స్‌ను ముమ్మరం చేశాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్జీ),ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)సభ్యుల సహాయంతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి చొరబాటు మార్గాల ద్వారా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని ఎల్ఈటీ యూనిట్ డ్రోన్లను ఉపయోగించి వైమానిక నిఘా నిర్వహించిందని, ఎల్ఓసీలోకి చొరబడే మార్గాలను గుర్తించిందని, రాబోయే రోజుల్లో ఫిదాయీన్ తరహా దాడులు లేదా ఆయుధ దాడులకు ఇది సూచన అని నిఘా అధికారులు వివరించారు.మాజీ ఎస్ఎస్జీ సైనికులు, ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు (బీఎటీలు) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంతటా మోహరించారని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. గత అక్టోబర్‌లో జమాత్ ఈ ఇస్లామి, హిజ్బుల్ ముజాహిదీన్ ఐఎస్ఐ సభ్యులు ఒకచోట సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన నష్టాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సమావేశంలో ప్రణాళికలను ఖరారు చేశారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. భారత రక్షణదళ అధికారులు అధికారులు ఈ నిఘా సమాచారాన్ని క్లిష్టమైన హెచ్చరికగా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం, నిఘా యంత్రాంగం హై అలర్ట్‌లో ఉంది. గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో భారత్ తన త్రిశూల్ ట్రై-సర్వీస్ విన్యాసాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ నిఘా సమాచారం అందింది. ఇది కూడా చదవండి: బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి -
‘ఉగ్ర’ అడ్డాగానే పాక్
* అమెరికా విదేశాంగ శాఖ వెల్లడి * ఆగని లష్కరే కార్యకలాపాలు వాషింగ్టన్: పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగానే కొనసాగుతోందని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. ముఖ్యంగా పాక్‌లోని వజీరిస్తాన్, బలూచిస్తాన్సహా అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా ఉన్నాయని ఉగ్రవాదంపై రూపొందించిన తన వార్షిక నివేదికలో వెల్లడించింది. పాక్‌కు చెందిన ఎఫ్ఏటీఏ(ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్), వాయువ్య ఖైబర్ ఫక్తూన్ఖ్వా రాష్ట్రం, ఆగ్నేయ బలూచిస్తాన్ ప్రవిన్స్లోని కొన్ని ప్రాంతాలు సైతం ఉగ్రవాదులకు నిలయాలుగా భాసిల్లుతున్నాయని పేర్కొంది. అల్‌కాయిదా, హక్కానీ నెట్వర్క్, తె హ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) లష్కర్-ఐ-జంఘ్వీ తదితర టైస్టు గ్రూపులు, అలాగే అఫ్ఘా తాలిబాన్ గ్రూపులు ఈ ప్రాంతంనుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించింది. పాకిస్తాన్‌లోను, అలాగే ఈ ప్రాంతమంతటా కార్యకలాపాలు సాగించేందుకు ఇక్కడినుంచే పక్కా ప్రణాళికలకు వ్యూహరచన చేస్తున్నాయని తెలిపింది. 2014లో పాక్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టి ఉత్తర వజీరిస్తాన్ ఏజెన్సీ, ఖైబర్ ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, ఇది టీటీపీపై ప్రభావం పడినా.. మరికొన్ని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఆగలేదని పేర్కొంది. లష్కరేపై పాక్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు టీటీపీ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై సైనికచర్య చేపట్టిన పాకిస్తాన్.. తమ దేశం నుంచి పనిచేస్తున్న లష్కరే తోయిబా(ఎల్ఈటీ), తదితర ఉగ్రవాద సంస్థలపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తాజా నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. ఎల్ఈటీ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని, శిక్షణ, ప్రచారం, నిధుల సమీకరణ వంటి చర్యలకు పాల్పడుతూనే ఉందని తెలిపింది. భారతదేశం ఉగ్రవాదుల లక్ష్యంగానే ఉందని పేర్కొంది. పాక్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలు, అలాగే ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి పొంచివున్న ముప్పును భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపింది.


