breaking news
Lalbaugcha Ganesh
-
గణేశ్ మండపం వ్యర్థాలతో ఇంధనం
ముంబై: ఈ ఏడాది ముంబైలోని ప్రఖ్యాత లాల్బాగ్చా గణేశ్ మండపం వద్ద ఏర్పడే ప్రసాద వ్యర్థాలు మొత్తం ఇంధనంగా మారనుంది. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ‘ప్రసాద్ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా ప్రసాదం తయారీ, పంపిణీల సమయంలో పుట్టుకొచ్చే సుమారు 80 టన్నుల వ్యర్థాలను బయోమెథనైజేషన్ ద్వారా వంట గ్యాస్‌గా మార్చనున్నారు. ఈ గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే 7700 యూనిట్ల విద్యుత్తును ముంబైలోని నాలుగు మున్సిపల్ ఆసుపత్రుల్లో వాడనున్నారు. సెలెబ్రిటీలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే లాల్బాగ్చా రాజా మండల్ సాయంతో తామీ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంసీ ప్రకటించింది. సోమవారంతో మొదలై మొత్తం పదకొండు రోజులపాటు జరిగే గణేశ్ ఉత్సవాల్లో రోజూ కనీసం 8 నుంచి పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూంటుందని బీఎంసీ అంచనా వేస్తోంది. ఈ చెత్తను అక్కడికక్కడే వేరు చేసి ప్రత్యేక వాహనాల ద్వారా నాయర్, కస్తూర్బా, జీటీబీ, సియాన్ ఆసుపత్రుల్లోని బయోమెథనైజేషన్ ప్లాంట్లకు తరలిస్తారు. ఈ ప్లాంట్లు ఒకొక్కటి రోజుకు రెండు టన్నుల వరకూ చెత్తను గ్యాస్‌గా మార్చగలవు. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మాత్రం చెత్తను బట్టి మారిపోతూంటుంది. ఆసుపత్రుల్లోని విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామని బీఎంసీ తెఇపింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించామని తెలిపింది. తడిచెత్త సాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేసి చెత్త సమస్యను పరిష్కరించవచ్చునన్న సందేశాన్ని అందరికీ పంపేందుకే తామీ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. -
ముంబై లాల్బాగ్చా రాజా గణపతి ఐకానిక్ ఫస్ట్ లుక్ (ఫోటోలు)
-
వరదల దెబ్బ:అయినా ఈ వసూళ్లు సూపర్!
సాక్షి,ముంబై:వినాయక చవితి ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది ముంబై వేడుకలు. అక్కడ కొలువుదీరే అదిభారీ విగ్రహాలు...హంగులూ..సంబరాలు. ముఖ్యంగా లాల్బాగ్చా వినాయకుడి పత్ర్యేకత ఇంతా అంతా కాదు. ఏటేటా లక్షలాది జనం లాల్బాగ్చా గణపతి దర్శించుకుని, విలువైన కానుకలు సమర్పించుకుంటారు. ఈ 11 రోజుల పండుగలో ఈ ఏడాది వసూళ్లు దాదాపు రూ.6కోట్లు. అయితే పెద్దనోట్ల చలామణి ముగిసి సంవత్సరం దాటినా ఇంకా ఈ హుండీలో ఇవి దర్శనమివ్వడం విశేషం. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు డబ్బు, బంగారు , వెండి, ఇతర వస్తువులను ప్రజలు విరాళంగా ఇస్తుంటారు. ఇది రికార్డ్ స్థాయిలో ఉంటుంది. ఈ ఏడాది కూడా అంతేకాదు భారీ ఎత్తున బంగారం, వెండి వసూలైంది. ఇందులో రూ.1.1 లక్షల రద్దయిన వెయ్యి రూపాయల ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. లాల్బాగ్చారాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండలి అందించిన సమాచారం ప్రకారం భక్తుల కానుకల్లో మొత్తం రూ .5.8 కోట్ల నగదు, 5.5 కేజీల బంగారం, 70 కేజీల వెండి లెక్క తేలింది. లెక్కింపు పూర్తైన అనంతరం వీటి వేలం నిర్వహిస్తామన్నారు. తద్వారా వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు లాల్బాగ్చారాజా సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ అధ్యక్షుడు బాలాసాహెబ్ కుంబ్లే వెల్లడించారు. మరోవైపు పండుగ మధ్యలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారంణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కానుకల విలువ భారీగా తగ్గింది. గతేడాది రూ.8కోట్ల డొనేషన్లు రాగా, ఈసారి అది రూ.5.8 కోట్లకు పడిపోయినట్టు నిర్వాహకులు తెలిపారు.


