breaking news
Lalbahadur Stadium
-
హైదరాబాద్‌లో చెస్ టోర్నీ.. ప్రైజ్‌మనీ, ఇతర వివరాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బిలో 1600 ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ జరగనుంది. విజేతకు రూ. 35 వేలు... రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 22,500... మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 11 వేలు అందజేస్తారు. స్పాట్ ఎంట్రీలను స్వీకరించరు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునేవారు 7337578899, 8338399299 ఫోన్ నంబర్లలో ఈనెల 9వ తేదీలోపు తమ పేరు నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు. చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..? -
సమైక్య శంఖారావం సభను సక్సెస్ చేయండి
సాక్షి,నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పార్టీలకు అతీతంగా జిల్లా ప్రజ లు తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క న్వీనర్ మేరిగ మురళీధర్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఇందుకోసం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటికే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ నిరాహారదీక్షలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు. షర్మిల సైతం శంఖారావం బస్సుయాత్రను సీమాంధ్ర ప్రాంతంలో నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ సభకు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలు సీమాంధ్రకు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసుకునేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహకరించడం దారుణమన్నారు. బాబు సీమాంధ్రకు చెందిన వాడిగా ఉండి రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వడం దారుణమన్నారు. సీమాంధ్రులు బాబును క్షమించరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రులు గ ట్టిగా బుద్ధిచెబుతారన్నారు. సీమాం ధ్రుల ఉద్యమాలను కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. నెలల తరబడి సీమాంధ్రులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. ఇదంతా సీమాంధ్రులు మరువరన్నారు. తగిన సమయం చూసి బుద్ధిచెబుతారని తెలిపారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు మురళీ చెప్పారు. సమన్వయకర్తలందరూ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రికి అందరూ హైదరాబాద్‌కు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. -
సమైక్య శంఖారావం పూరించండి
సాక్షి, కడప : వైఎస్సార్ సీపీ ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. కలసపాడు మండలం ముద్దంవారిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు ఈనెల 26వ తేదీన హైదరాబాదులో జరిగే సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అన్ని విభాగాల అనుబంధ సంస్థలు, సర్పంచులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ అభిమానులు సభకు తరలి రావాలన్నారు. పార్టీలకు అతీతంగా సమైక్య సభ జరగనున్న నేపథ్యంలో సమైక్యతకు కట్టుబడిన పార్టీలతోపాటు సమైక్యవాదులందరూ హాజరు కావాలని వారు కోరారు. పార్టీ ప్రతిష్టగా తీసుకుని సభను జరుపుతున్నందున ప్రతి నియోజకవరం్గం నుంచి ఐదు వేలకు తగ్గకుండా సభకు ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కాదా? రాష్ట్రంలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నా టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. దీనికితోడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలుగుదేశం పార్టీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. పచ్చకామెర్ల రోగిగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయలేదని, ఇందులో నలుగురు టీడీపీ ఎంపీల రాజీనామాలు కూడా లేవని స్పీకర్ కార్యాలయమే స్పష్టం చేసిందన్నారు. ఇక్కడ మాత్రం రాజీనామాలు చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని పార్టీలు సమైక్య శంఖారావం సభలో పాల్గొంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెడితే అధికార పార్టీకి అనుకూలంగా విప్ జారీ చేసి ఓట్లు వేసింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లాలో నాలుగు సింగిల్‌విండో అధ్యక్ష స్థానాలను గెలుచుకుంటే వారు కాంగ్రెస్‌పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని, సమైక్యానికే కట్టుబడి ఉన్న వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీగా వైఎస్సార్ సీపీ అందరి గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఏ పార్టీ సహకరించకపోయినా, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా హైదరాబాద్‌లో సభ జరపాలని నిర్ణయించడం పార్టీ నిబద్ధతకు చిహ్నమని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సైతం సభను విజయవంతం చేయాలని ముఖ్య నేతలందరికీ వ్యక్తిగతంగా సూచించారన్నారు. ఈ సమావేశంలో బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ మునెయ్య, వైస్ చైర్మన్ గురుమోహన్, కలసపాడు మాజీ జెడ్పీటీసీ భూపాల్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు అంకన గురివిరెడ్డి, కాశినాయన మాజీ మండలాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, నాయకులు బాలమునిరెడ్డి, చిత్తా రవిప్రకాష్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, సింగనమల వెంకటేశ్వర్లు, పులి సునీల్ కుమార్, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.