breaking news
lalasa
-
లాలస: స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా?
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు. మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది. స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస. ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు. చదవండి: కనపడని నాలుగో సింహం..!ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.- కాత్యాయని -
సెమీస్‌లో లాలస, సోమిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో లాలస, సోమిత సెమీస్‌లోకి ప్రవేశించారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో బుధవారం జరిగిన అండర్-14 బాలికల క్వార్టర్స్ ఫైనల్లో లాలస 6-2తో ఐరాసూద్పై గెలుపొందగా... సోమిత 6-3తో కుంకుమ్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రేష్ట 6-1తో తేజస్వినిపై, ఆర్ని రెడ్డి 6-3తో సుకృతపై పైచేయి సాధించారు. బాలుర క్వార్టర్స్‌లో ప్రణీత్ రెడ్డి 6-3తో వర్షిత్‌పై, హరిహశ్వంత్ 6-4తో అనీష్ రెడ్డిపై, ఆదిత్య 6-2తో కాశీ విశ్వనాథ రావుపై, ఆర్య జాదవ్ 6-2తో వరుణ్‌పై విజయం సాధించారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు అండర్-10 బాలురు: శౌర్య గుప్తా 6-5 (5)తో మిహిర్ పర్చాపై, చిత్రదర్శన్ 7-5తో ఆర్నవ్ బిషోయ్పై, ప్రణీత్ సింగ్ 6-3తో ధరణి దత్తపై, శ్రీ ప్రణవ్ 6-5 (2)తో వెంకట్ రిషిపై నెగ్గాయి. బాలికలు: వెన్నెల 6-1తో శివానిపై, సౌమ్య 6-0తో త్రినియాసిని రెడ్డిపై, నీరాలి 6-0తో మలిష్కపై గెలుపొందారు. అండర్-12 బాలురు: వర్షిత్ కుమార్ 6-1తో వరుణ్‌పై, లిఖిత్ 6-3తో యువరాజ్‌పై, హర్షవర్ధన్ 6-5 (11)తో సిద్ధార్థ్ శ్రీనివాస్‌పై, అనీష్ రెడ్డి 6-3తో ఆర్యంత్రెడ్డిపై పైచేయి సాధించారు. బాలికలు: శ్రీహిత 6-2తో నీరాలిపై, సౌమ్య 6-3తో రీతూపర్ణపై, ఆర్ని రెడ్డి 6-2తో చాందినిపై, కుంకుమ్ 6-2తో అదితి మీనన్‌పై విజయం సాధించారు.