-
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్‌లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
ప్రాణాధారం
ప్రాణాయామం అంటే ప్రాణ + ఆయామ (నియంత్రించుట) లేదా ప్రాణ + యమ (ఎరుక). లోపలికి వెళ్లి బయటకు వచ్చే ప్రాణ వాయువును పూర్తిగా మనసు పెట్టి నియంత్రించడం అని అర్థం చేసుకోవాలి. యోగసాధనలో ప్రాణయామం చాలా విశిష్టత కలిగిన భాగం. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా ఆసనాలు వేయడం పూర్తయ్యాక ప్రాణాయామం విధిగా ఆచరించదగినది. ప్రాణయామాల వల్ల సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్రములోని 724 ట్రిలియన్ల (లక్ష కోట్ల) కణజాలానికి ఆక్సిజన్ పూర్తిగా అందుతుంది. దీంతో శరీరభాగాలన్నీ ఆరోగ్యవంతం అవుతాయి. యోగాసనాల సాధన క్రమంలో శరీరంలో ఉత్పత్తి అయి పేరుకుపోయే లాక్టిక్ ఆమ్లం కండరాల నొప్పులకు, కీళ్ల నొప్పులకు ముఖ్య కారణం. దీనిని తీసివేసి దేహానికి ఉపశమనం కలిగించాలి. అలా చేయాలంటే ప్రాణాయామం చక్కని మార్గం. శరీరంలో ఉత్పత్తి అయిన లాక్టిక్ ఆమ్లం కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి బయటకు తేలికగా పోయేందుకు ఆసనాలు సాధన చేసిన తర్వాత ప్రాణాయామం చేయడం చాలా మంచిది. ప్రాణాయామాలు రెండు రకాలు ప్రాణయామాన్ని బహిరంగ, అంతరంగ అని రెండు విధాలుగా విభజించవచ్చు. కణజాలం బాహ్యపొర వరకూ ప్రాణవాయువును తీసుకెళ్లేవి బహిరంగ ప్రాణయామాలు, కణజాలం లోపలి వరకూ ప్రాణవాయువును పంపేవి అంతరంగ ప్రాణయామాలు. కొత్తగా సాధన చేసేవాళ్లు బహిరంగ ప్రాణయామాల మీద పట్టు సాధించిన తర్వాతనే అంతరంగ ప్రాణయామ సాధన ప్రారంభించాలి. అందుకని తొలుత బహిరంగ ప్రాణాయామాల గురించి వివరిస్తున్నాం. సూర్యభేది బహిరంగ ప్రాణయామాల్లో సూర్యభేది ఒకటి. దీనిని సాధన చేయాలంటే మొదట నాసికాగ్ర ముద్ర వేయాలి. అంటే కుడి చూపుడువేలు, మధ్యవేలు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచాలి. ఉంగరపు వేలును ఎడమ ముక్కు ఎముక (సెప్టమ్ బోన్) మీద ఉంచి బొటన, చిటికెనవేళ్లను కుడి, ఎడమ నాసికలను మూయడానికీ తెరవడానికీ ఉపయోగించాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలి మీద ధ్యానముద్రలో ఉంచాలి. అంటే చూపుడు వేలు కొనను బొటనవేలు కొనకు తాకించి మిగిలిన మూడు వేళ్లను బయటకు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ ఉంచాలి. కుడినాసికతో శ్వాస సుఖ పూర్వకంగా లోపలికి తీసుకుని బొటనవేలితో కుడినాసికను మూసి, ఎడమ నాసిక గుండా శ్వాసను సుఖపూర్వకంగా బయటకు వదలాలి. ఎడమనాసికను చిటికెనవేలుతో మూసి కుడి నాసిక నుంచి మళ్లీ శ్వాస తీసుకోవాలి. ఇలా 5 నంచి 10 సార్లు చేయవచ్చు. తీసుకునే శ్వాసకన్నా వదిలే శ్వాసకు ఎక్కువ సమయం తీసుకోవడం మంచిది. మధ్యలో శ్వాసను ఆపి ఉంచవలసిన అవసరం లేదు. ఉపయోగాలు: ఇది సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజ పరచి జీవక్రియను చైతన్యవంతం చేస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. బద్ధకాన్ని దూరం చేస్తుంది. పొట్ట కండరాల్లో కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. ‘ఉజ్జయి’ చేయడం వలన కేలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. (ఉజ్జయి అనగా శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు పాము బుసలా శబ్దం చేయడం). విభాగ (3 రకాలు) రెండవ బహిరంగ ప్రాణయామం ఇది. ఊపిరితిత్తులలోని విభిన్న భాగాలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది కాబట్టి దీన్ని విభాగ ప్రాణయామం అంటారు. ఉపయోగాలు: ఊపిరి తిత్తుల్లోని పైభాగాలకు, మధ్య భాగాలకు, క్రింది భాగాలకు ఆక్సిజన్‌ను విడివిడిగా సరఫరా చేసేందుకు ఉపకరిస్తుంది. దీని వలన ఊపిరితిత్తుల్లో అత్యంత కింద భాగంలో ఎప్పుడూ పనిచేయని ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మొదలుపెడతాయి. ఊపిరితిత్తుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఆస్త్మా సమస్య ఉన్నవారు, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు దీనిని మరింత ఎక్కువ సాధన చేయాలి. దీనిని 3 రకాలుగా సాధన చేయవచ్చు. ఊర్ధ్వ: సుఖాసనంలో గాని, అర్ధ పద్మాసనంలో గాని, పద్మాసనంలోగాని కూర్చోవాలి. అలా నేల మీద కూర్చోలేనివారు కుర్చీలో కూర్చుని చేయవచ్చు. దీనిలో వెన్నెముకను నిటారుగా ఉంచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకెళ్లి అరచేతుల్ని ఆకాశంవైపు చూపుతూ ఇంటర్‌లాక్ చేయాలి. తలని కాస్త పైకి లేపి 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ భూమి వైపునకు చూపిస్తూ పక్క నుంచి నెమ్మదిగా కిందకు తీసుకు రావాలి. మెడను, భుజాలను పైకి కిందకు కదిలిస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇది మెదడు, థైరాయిడ్ సమస్యలకు ఉపయుక్తం. మధ్య: చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ ముందుకు నేలకి సమాంతరంగా స్ట్రెచ్ చేయాలి. వీలుకొద్దీ 3 నుంచి 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు ముందు నుంచి పక్కకు కిందకు తీసుకురావాలి. భుజాలు, మెడ కండరాలు పట్టుకుంటే రిలాక్స్ చేయాలి. గుండెలో బ్లాక్స్ ఉన్నవారికి హైబీపీ ఉన్నవారికి మంచిది. అధో: చేతులు రెండూ వెనుకకు కిందకు తీసుకెళ్లి ఇంటర్‌లాక్ చేసి కలిపి ఉంచిన అరచేతులు రెండింటినీ భూమి వైపునకు చూపిస్తూ సాగదీస్తూ ఛాతీని ముందుకు ప్రొజెక్ట్ చేసి 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని తర్వాత శ్వాస వదులుతూ చేతులు కిందకు తీసుకురావాలి. మెడ, భుజాలు రిలాక్స్ చేయాలి. జీర్ణసమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది. లివర్, పాంక్రియాస్, జీర్ణవ్యవస్థలకు చాలా మంచిది. జాగ్రత్తలు: కొన్ని రకాల ప్రాణయామాలను హైబీపీ ఉన్నవాళ్లు, హైపర్ యాక్టివ్‌గా ఉన్న పిల్లలు చేయకపోవడం మంచిది. ఏ ప్రాణయామమైనా ఊపిరితిత్తుల సామర్థ్యానికి మించి చేయరాదు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొనసాగించవ చ్చు. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement