breaking news
La Paz
-
ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే?
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరాల్లో ఒకటైన ఎల్ ఆల్టోలో లైఫ్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చాలా మంది దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ఉన్న ఎల్ ఆల్టోకు వెళ్తుంటారు. లా పాజ్ నగరానికి సమీపంలో ఉన్న ఈ నగరం.. ఎత్తైన ప్రాంతాల్లో ప్రజల దైనందిన జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేస్తుంది.విశాలమైన రహదారులు, ఇటుక భవనాలు, కలర్‌ఫుల్ మార్కెట్ స్ట్రీట్స్, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఎల్ ఆల్టో ప్రత్యేకత. కేబుల్ కారులో ప్రయాణిస్తే నగరం విస్తరించిన తీరు, కొండలు, రహదారులపై రాకపోకలు మరో కోణంలో కనిపిస్తాయి. మార్కెట్లలో స్థానికులు తమ రోజువారీ పనుల్లో బిజీగా కనిపిస్తారు.ఎల్ ఆల్టో వైబ్‌ను ఫీల్ అవ్వాలంటే కేబుల్ కారులో ప్రయాణిస్తే సరిపోతుంది అంటారు. ఇక్కడి మెర్కాడో 16 డి జులియో మార్కెట్లో స్థానికుల సందడి కనిపిస్తుంది. సమీపంలోని లా పాజ్ నగరం, వల్లే డి లా లూనా ప్రాంతాలను కూడా ట్రావెల్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. ఎల్ ఆల్టోలో మన సమోసాల్లా ఉండే సాల్టెనాస్ను వేడివేడిగా ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే హాట్ డ్రింక్‌తో పాటు స్వీట్‌గా ఉండే ఆపి కాన్ పాస్టెల్ను ఎంజాయ్ చేయవచ్చు. ఎత్తైన ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణం, నగర దృశ్యాలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.ఎప్పుడు వెళ్లాలి?ఎల్ ఆల్టోలో మే నుంచి అక్టోబర్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉండటంతో పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్లినా.. మొదటి రోజు కాస్త నెమ్మదిగా స్థానిక వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ చెక్‌లిస్ట్ ప్రకారం ట్రావెల్‌ను కంటిన్యూ చేయొచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బొలీవియాకు నేరుగా విమానాలు లేవు. ఒకటి లేదా రెండు కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా బొలీవియా రాజధాని లా పాజ్ చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 24–30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. లా పాజ్ నుంచి ఎల్ ఆల్టోకు రోడ్డు మార్గంలో లేదా కేబుల్ కార్ ద్వారా చేరుకోవచ్చు.ఇదీ చదవండి: ఈ 5 పర్వతాలను ఎవరూ అధిరోహించలేదు! ఎందుకంటే? -
జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..
లా పాజ్ : అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణ అమెరికా దేశం బొలీవియా రక్తసిక్తమవుతోంది. అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమంటూ నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి ఈడ్చుకువచ్చి... హంతకురాలు అని అరుస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం ఆమెపై ఎరుపు రంగు కుమ్మరించి... ఆపై జుట్టు కత్తిరించి.. చెప్పుల్లేకుండా రోడ్డుపై నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని... పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు. కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా మేయర్‌పై దాడి ప్రతిపక్షాల దురహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ‘ తన అనుచరులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పేదల పక్షాన నిలబడినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా ఘటనపై స్పందిస్తూ.. ‘ మహిళగా పుట్టడమే ఆమె చేసిన నేరం. నిజాయితీగా ఉండటమే ఆమె తప్పు. మహిళ అయినందుకే ఈ ఘోరం అని వ్యాఖ్యానించారు. ఇక అధికార పార్టీ మహిళా విభాగం కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది. మేయర్‌పై దాడిని.. జాత్యహంకార, వివక్షాపూరిత, హింసాత్మక ఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఫాసిస్టు నాయకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొంది. కాగా 2006లో బొలీవియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఎవో మారెల్స్.... ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
కార్నివాల్ సంబరాల్లో 40 మంది మృతి
లా పాజ్ : బొలీవియాలో కార్నివాల్ వీకెండ్ సంబరాల్లో 40 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారని బొలివియా అంతర్గత మంత్రి కార్లోస్ రోమెరో తెలిపారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం..16 మంది రోడ్డు ప్రమాదాల్లో, 8 మంది ఫుడ్ స్టాల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలడం వల్ల, మరో ఆరుగురు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారని వెల్లడించారు. నలుగురు నరహత్యకు గురయ్యారని, ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మరో వ్యక్తి హైపోధెర్మియాతో చనిపోయారని తెలిపారు. గత సంవత్సరం 2017 కార్నివాల్ సంబరాల్లో 67 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు.


