-
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
స్నాప్‌డీల్‌లో రూ.3,269 కోట్ల తాజా పెట్టుబడులు
సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, ఫాక్స్‌కాన్ నుంచి నిధులు న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్‌కాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్‌డీల్ తెలి పింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ల నుంచి కూడా ఈ తాజా రౌండ్ నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని స్నాప్‌డీల్ సీఈఓ, వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ బహాల్ చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థ వంద కోట్ల డాలర్లుకు పైగా పెట్టుబడులను సాఫ్ట్బాంక్(62.7 కోట్ల డాలర్లు), పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాల నుంచి రాబట్టింది. కాగా పెట్టుబడి వివరాలను స్నాప్‌డీల్ వెల్లడించలేదు. అయితే ఫాక్స్‌కాన్‌కు చెందిన ఎఫ్ఐహెచ్ మొబైల్ సంస్థ స్నాప్‌డీల్‌లో 4.27 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని పేర్కొంది. ఈ లెక్కన స్నాప్‌డీల్ విలువ 400-500కోట్ల డాలర్లు(రూ.25,200-31,500 కోట్లు) ఉంటుందని అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement