breaking news
Kotwali Police Station
-
కరెన్సీ నోటు మీద గాడ్సే చిత్రం
భోపాల్: ఓ వ్యక్తి కరెన్సీ నోటు మీద మహాత్మాగాంధీకి బదులు గాంధీని హతమార్చిన నాథూరాం గాడ్సే ఫొటోను ఎడిట్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు వారం రోజుల తర్వాత కేసు నమోదు చేసిన ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)కి చెందిన శివమ్ శుక్లా మే 19న నాథూరాం గాడ్సే జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. (వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..) 'నాథూరాం గాడ్సే వర్ధిల్లు గాక' అంటూ రూ.10 నోటుపై మహాత్ముడి చిత్రానికి బదులు నాథూరాం గాడ్సే ఉన్న చిత్రాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. "దేశాన్ని నాథూరాం రక్షించాడు" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టామని కొత్వాలీ సిధి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఎమ్ పటేల్ తెలిపారు. (ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..) -
ప్రియుడితో కలసి భర్త గొంతు కోసింది...
భోపాల్: ప్రియుడితో కలిసి అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్తను పాశవికంగా గొంతుకోసి ఓ ఇల్లాలు కడతేర్చింది. అయితే, మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జీ సునీల్ ఖేమారియా కథనం ప్రకారం... అశోక్ సింగ్(34), తన భార్య అంజనా, ముగ్గురు పిల్లలతో కలిసి భైంద్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి వీరి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన అశోక్ తల్లి ఉషా కొత్వాలీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడు రోజుల నుంచి కుమారుడి కుటుంబం వివరాలు తెలియడం లేదని, వారి ఇంటికి తాళం ఉందని గురువారం ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది. అశోక్ ఇంటికి చేరుకున్న పోలీసులు తాళాలు బద్దలుకొట్టి లోనికి వెళ్లారు. అతడ౮ రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించారు. ఓ పదునైన వస్తువుతో అశోక్ గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య అంజనా, పిల్లల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా అశోక్ భార్యకు అశీష్ చౌదరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధాలున్నాయని, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. అశోక్ తల్లి చెప్పిన వివరాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ప్రియుడు అశీష్ చౌదరి సహా ముగ్గురు పిల్లలతో కలిసి అంజనా పరారయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సునీల్ ఖేమారియా వివరించారు.