సీపీఐ రాస్తారోకో: భారీగా ట్రాఫిక్జామ్
తిమ్మాపూర్ : కొత్తపల్లి రిజర్వాయర్ నిర్మించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఆ మార్గంలో ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రిజర్వాయర్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రిజర్వాయర్ పరిధిలోని చిగురుమామిడి, పెద్దింకి మండలాల ప్రజలు డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.