breaking news
Kondapeta Bridge
-
గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
చెన్నూరు : చెన్నూరు కొండపేట వంతెన వద్ద ఆదివారం గల్లంతైన వడ్డె రాముడు(25) మృతదేహం సిద్దవటం మండలం లింగంపల్లె సమీపంలో మంగళవారం లభ్యమైంది. పెన్నానది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సుమారు 17 కిలోమీటర్ల దూరం వరకు మృతదేహం కొట్టుకుపోయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగిరికి చెందిన వడ్డె రాముడు(25) కోసం రెండు రోజులుగా మండల పరిధిలోని నదిలో మృతుని బంధువులు, పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు సిద్దవటం మండలానికి చెందిన వారు అక్కడి ఎస్ఐకి లింగంపల్లె వద్ద ఓ మృతదేహం ఉందని చెప్పడంతో ఆయన చెన్నూరు ఎస్ఐ వినోద్‌కుమార్‌కు తెలియజేశారు. అక్కడికి వెళ్లి నదిలోనుంచి మృతదేహాన్ని బయటకు తీయించి మృతుని బంధువులకు చూపించగా గుర్తుపట్టారు. రిమ్స్‌లో శవపరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించామని ఎస్ఐ వివరించారు. -
విచార వదనం
చెన్నూరు : పెన్నానదిలో గల్లంతైన వడ్డె రాముడు(25) కోసం సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆ దోని మండలం బైచగరికి చెందిన రాముడు కొండపేట వంతెన వద్ద ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. విష యం తెలుసుకొన్న ఆయన బంధువులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున వంతెన వద్దకు వచ్చారు. యువకులు నది వెంట గాలింపు చర్యలు చేపట్టారు. వంతెన వద్దే తిండి తిప్పలు లేక విచార వదనంతో ఉన్న వారికి కొండపేటకు చెందిన దా త భోజనం ఏర్పాటు చేశారు. నది వెంట ఎంతగా గాలించినా ఫలితం లేదని బాధితులు వాపోయారు. పోలీసులు గాలింపు చర్యలకు సహకరించలేదని, తాము స్టేషన్ వద్దకు వెళ్లినా పట్టించుకోలేదంటూ వా రు వాపోయారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు బాధిత కుటుంబం, బం ధువులు వారి పిల్లలు, మహిళలు రోదిస్తూ వంతెనపైనే ఉన్నారు. ఈ విషయంపై ఎస్ఐ వినోద్‌కుమార్ మాట్లాడుతూ తాము జాలర్లను పిలిపించి, వెతికించామని రాత్రి 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి 10 మందిని జాలర్లతో వెతికిస్తామని చెప్పారు.