breaking news
kolkata rape
-
అత్యాచారం చేసి.. కిరోసిన్ పోసి తగలెట్టేశారు!
పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్కతాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు మరో కొత్త మలుపు తిరిగింది. అక్టోబర్ నెలలో రెండుసార్లు అత్యాచారానికి గురి కావడం, పదే పదే రేపిస్టుల నుంచి బెదిరింపులు ఎదుర్కోవడంతో తట్టుకోలేని 16 ఏళ్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని గత రెండు మూడు రోజులుగా చెబుతున్నారు. అయితే, ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని ఇప్పుడు పోలీసులు అంటున్నారు. రేపిస్టులే ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారని తేల్చారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిపై తగిన చర్యలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సిందిగా నిందితులు రతన్ సిల్, మింటా సిల్ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లిద్దరూ ఆ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొడుకులు. అయితే, అందుకు ఆమె తిరస్కరించడంతో వాళ్లు కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. పైకి మాత్రం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంతకుముందు వారిపై బెదిరింపు కేసు మాత్రమే నమోదైంది. బాధితురాలు మరణించిన ఒకరోజు తర్వాత.. అంటే డిసెంబర్ 24న వారిని పోలీసులు అరెస్టుచేశారు. రెండు రోజుల క్రితం.. మంగళవారం నాడు ఆమె కాలిన గాయాలతో ఆస్పత్రిలో మరణించింది. -
ఫుట్పాత్ చిన్నారిపై టాక్సీలో అత్యాచారం
దాదాపు 20 నెలల క్రితం కోల్కతాలోని పార్క్స్ట్రీట్లో ఓ దారుణం ఎలా జరిగిందో మళ్లీ అలాంటి సంఘటనే మరోసారి జరిగింది. ఫుట్ పాత్ మీద నివసించే కుటుంబంలోని ఓ పదమూడేళ్ల చిన్నారిని కారులోకి లాగి దారుణంగా అత్యాచారం చేశారు. ఈ దారుణం పార్క్స్ట్రీట్కు అత్యంత సమీపంలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ రోడ్డులో జరిగింది. ఈ సంఘటనతో సంబంధమున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. టాక్సీ డ్రైవర్ కోసం, అత్యాచారం చేసిన మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2012 ఫిబ్రవరిలో కొందరు యువకులు ఓ ఆంగ్లో ఇండియన్ యువతితో స్నేహం చేసినట్లు నటించి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణంతో అప్పట్లో కోల్కతా నగరం అట్టుడికింది. ఈ కేసుపై ఇప్పటికీ కోర్టులో విచారణ సాగుతోంది. కానీ ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.