breaking news
koilakuntla
-
టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం
నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్చల్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
గ్రామం కనుమరుగై 200 ఏండ్లు.. అయినా ఆనవాళ్లు ఇప్పటికి పదిలం
సాక్షి, కర్నూలు( కోయిలకుంట్ల): కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని శతాబ్ధాల క్రితం కనుమరుగైన గ్రామాలు ఆనవాళ్ల ఆధారంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుందూనది పరివాహకంలోని బొబ్బిలి గుంతల, కనుమలపాడు, దద్దనాల గ్రామాలు రెండు వందల ఏళ్ల క్రితం కనుమరుగు కాగా అదే సమయంలో పట్టణానికి ఆరు కి.మీ దూరంలో ఉన్న గుండుమల గ్రామం ఖాళీ అయినట్లు పలు ఆనవాళ్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. రెండు శతాబ్ధాల క్రితం నుంచి గ్రామం లేకపోయినా ఆ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామాన్ని గుర్తుచేస్తున్నాయి. కాలగమనంలో కలిసిన గుండుమల: కోవెలకుంట్ల పట్టణ శివారులోని ఎస్సార్బీసీ నుంచి పొలాలకు వెళ్లే రహదారిలో సుమారు ఆరు కి.మీ దూరంలో రెండు వందల సంవత్సరాల క్రితం వరకు గుండుమల గ్రామం ఉండేది. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో అన్ని కులాలకు సంబంధించి సుమారు 300 కుటుంబాలు జీవనం సాగించేవి. సుద్దరాళ్లతో తక్కువ ఎత్తులో నిర్మించుకున్న ఇళ్లు, కొట్టాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం, కులవృత్తుల ఆధారంగా కుటుంబాలను పోషించుకునే వారు అక్కడ నివసించే ప్రజలు. కొర్ర, ఆరుకలను ప్రధాన పంటలుగా, సజ్జ, జొన్న, వేరుశనగ, కంది, పెసర, తదితర పంటలను సాగుచేసేవారు. కుండలు చేయడం, చెప్పులు కుట్టడం, మగ్గంనేయడం, తదితర కులవృత్తులతో ఆయా కులాల్లోని కుటుంబాలు కుల వృత్తులు నిర్వహించేవారు. వీరభద్రస్వామి, శ్రీరాముడు, ఆంజనేయస్వాములను ఆరాధ్య దైవాలుగా కొలిచినట్లు ప్రస్తుతం లభ్యమైన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గ్రామస్తులు సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పండులను అత్యంత వైభవంగా నిర్వహించేవారని బయటపడ్డ ఆధారాల ద్వారా వెల్లడి అవుతోంది. కుందూనది వరదలు, దొంగల బెడదతో గ్రామం ఖాళీ: పట్టణానికి సుదూరంలో ఉండటం, చుట్టుపక్కల కనుచూపుమేర గ్రామాలు లేకపోవడం, పక్కనే కుందూనది ఉండటంతో నదికి తరుచూ సంభవించే వరదలు, దొంగల బెడదతో రెండు వందల సంవత్సరాల క్రితం గ్రామం ఖాళీ అయింది. గ్రామానికి అతి సమీపంలోనే కుందూనది ప్రవహిస్తుండటం, ఆకాలంలో అధికంగా వర్షాలు కురిసేవి. వర్షాకాలమంతా నది ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తేది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి, పంటనష్టం జరిగి గ్రామస్తులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. వేసవికాలంలో దొంగలు పడి గ్రామంలో పడి డబ్బులు, బంగారు ఆభరణాలు, ధాన్యం, తదితర విలువైన వస్తువులు దోచుకెళ్లేవారు. వరదలు, దొంగల బెడదతో గ్రామస్తులు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి గ్రామానికి సమీపంలో ఉన్న భీమునిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల ప్రాంతాలకు వలస వెళ్లడంతో క్రమేపి గ్రామం ఖాళీ అయ్యింది. ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వంశస్తులు ఇప్పటికి ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. రెండు శతాబ్ధాలు గడిచినా ఆనవాళ్లు పదిలం: గ్రామం కనుమరుగై రెండు వందల సంవత్సరాలు దాటినా గ్రామానికి సంబంధించిన పలు ఆనవాళ్లు ఇప్పటికి పదిలంగా ఉన్నాయి. ఇళ్లకు సంబంధించి పునాది గోడలు, గ్రామ ప్రజల దాహార్తి తీర్చే కుంట, ప్రజలు ఆరాధ్య దైవాలుగా కొలిచే వీరభద్రస్వామి, రామునిరాతి విగ్రహాలు, వీరభద్రస్వామిని ఊరేగించే రథచక్రాలు, కుంటకు సంబంధించిన మెట్లు గ్రామాన్ని గుర్తు చేస్తున్నాయి. గ్రామం కనుమరుగు కాగా గ్రామం ఉన్న ప్రాంతం క్రమేపి వ్యవసాయ భూమిగా మార్పు కావడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైతులు శెనగ, జొన్న పంటలు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో గ్రామానికి సంబంధించిన భూములను ఇప్పటికి గుండుమల పొలాలుగా పిలుస్తుండటం విశేషం. చదవండి: అదొక చిన్న గ్రామం.. అయితేనేం ప్రభుత్వ ఉద్యోగుల అడ్డాగా మారింది -
కోవెలకుంట్ల డిగ్రీ కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడ్
– 2.77 పాయింట్లతో రాష్ట్రంలో మొదటి స్థానం – కళాశాల అభివద్ధికి రూ. 2 కోట్ల రూసా నిధులు కోవెలకుంట్ల: పట్టణంలోని వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ సంస్థ బీ డబుల్ ప్లస్ గ్రేడు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాదం శశికళ చెప్పారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకొకసారి న్యాక్ బృందం కళాశాలను తనిఖీ చేస్తుందన్నారు. ఈ ఏడాది జులై 29, 30వ తేదీల్లో కోయంబత్తూరుకు చెందిన ప్రొఫెసర్ నటరాజన్, బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ రాధాకష్ణతో కూడిన బృందం కళాశాలను సందర్శించిందన్నారు. కళాశాలలో విద్యార్థుల చదువు, అధ్యాపకుల బోధన, విద్యార్థుల నడవడిక, పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, వసతులు, కళాశాలలో విద్యపూర్తి చేసుకుని స్థిరపడిన పూర్వ విద్యార్థుల వివరాలు, కళాశాలకు పూర్వ విద్యార్థుల చేయూత, తదితర అంశాలను పరిశీలించిందన్నారు. తుది నివేదికను బెంగళూరులోని న్యాక్ కార్యాలయంలో అందజేయగా ఇటీవలే ఆ సంస్థ అధికారుల సమావేశం నిర్వహించి కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడును కేటాయించనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే అత్యధికంగా 2.77 కిమిలేటివ్ గ్రేడ్ పాయింట్లు (సీజీపీఏ) కేటాయించడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతల సమష్టి కృషితో ఉత్తమ గ్రేడు సాధ్యమైందన్నారు. కళాశాలకు బీ డబుల్ ప్లస్ గ్రేడు రావడంతో రూ. 2 కోట్ల రూసా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ నిధులను అదనపు గదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించి కళాశాలను మరింత అభివృద్ధి చేసే అస్కారం ఉందన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శివారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.