breaking news
Kodaram
-
‘పాలమూరు’ను నిర్మించి తీరుతాం
షాద్‌నగర్ రూరల్: సీమాంధ్ర నాయకులు ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టంచేశారు. ఉమ్మడిరాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతపెట్టుదారులు, బడాబాబుల పెత్తనం కొనసాగడంతో తెలంగాణప్రాంతం ఎక్కువగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని గణేష్ గార్డెన్స్‌లో టీవీవీ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. పథకం పూర్తికి పార్టీలకతీతంగా తెలంగాణ నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసంఘాలు, నేతలు కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు. కృష్ణాజలాల్లో వాటా సాధిస్తాం జిల్లాప్రజలు వలసలతో జీవనం గడుపుతున్నారని, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీవీవీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని, వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలన్నారు. కృష్ణాజలాల్లో వాటా సాధించి తీరుతామన్నారు. ప్రాజెక్టులను సీమాంధ్ర నాయకులు అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. షాద్‌నగర్ ప్రాంతంలో అనేక పరిశ్రమలున్నా ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి దొరకడంలేదన్నారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవిందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి టీజీ శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, లక్ష్మినాయక్, రాజారాం, రవింద్‌గౌడ్, కృష్ణబగాడే, నర్సింహా, చంద్రశేఖర్, నర్సింలు, ప్రశాంత్, కిష్టప్ప, శ్రీహరి పాల్గొన్నారు. -
ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొడంగల్ /బొంరాస్‌పేట: గ్రామాల్లో నా ణ్యమైన విద్య అంది విద్యాభివృద్ధి జరగాలంటే ప్రతీ మండలకేంద్రంలో రెసిడెన్షియల్ విధానంతో పాఠశాలలు, కళాశాలుండాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని, తెలంగాణ ప్రాంతంలోని నిరుపేదవర్గాల వారికి అండగాఉంటూ విద్య, వ్యవసాయం, ఉ ద్యోగం, ఉపాధి తదితర అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శ నివారం బొంరాస్‌పేట మండలం తుం కిమెట్లలో టీవీవీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో ఆ యన పాల్గొన్నారు. అనంతరం కొడంగ ల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రామాల్లో కులాలు, మతాలను ఏకం చేస్తూ గ్రామాభివృద్ధి కమిటీలుగా ఏర్పడాలన్నారు. చెరువులు, కుంటల అభివృద్ధితోనే వ్యవసాయం, కులవృత్తులతోపాటు అందరికీ ‘నీరుంటేనే నూరుపనుల’కు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఆ వుల చిన్నయ్య అమరులయ్యారని గుర్తుచేశారు. కొడంగల్ డిగ్రీ కళాశాల విషయ మై విద్యాశాఖ మంత్రి మాట్లాడతానని చెప్పారు. విద్యార్థులు మహనీయుల ఆ శయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో టీవీవీ జి ల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, గోపాల్, అనిల్‌కుమార్, రా జేశ్వర్‌రెడ్డి, కుర్మయ్య, చిన్న బాల్‌రాజ్‌గౌ డ్, తోలు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మోతీబాయి, సర్పంచ్‌లు లక్ష్మి, ర్యాకం అరుణ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి దే శ్‌ముఖ్, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ మనోహర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రవీంద ర్, అధ్యాపకబృందం పాల్గొన్నారు.