breaking news
kidnapped and killed
-
ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కిడ్నాప్.. ఆపై హత్య
న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఓ యువ అధికారి తిరుగుబాటుదారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన మేఘాలయలోని దక్షిణ గరో కొండల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి హోదాలో ఇటీవలే నియామకమైన అధికారి వికాస్ కుమార్ హత్యకు గురైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం నాడు ఓ టాటాసుమోలో వచ్చిన దుండగులు హత్యకు గురైన అధికారితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కిడ్నాపైన ఐబీ అధికారి వికాస్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు మేఘాలయాలోని ఏఎస్ఏసీ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. -
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య
వెనిజువెలాకు చెందిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఆంటోనియో సెర్మెనోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అనంతరం హతమార్చారు. సెర్మెనో గతంలో ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి సూపర్ బాంటమ్ వెయిట్, ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా ఉండేవారు. 1980లు, 90లలో ఈ రెండు విభాగాల్లో ఆయనదే రాజ్యం. 44 ఏళ్ల సెర్మెనోను ఆయన కుటుంబ సభ్యులతో సహా అందరినీ సోమవారం నాడు అపహరించారు. మంగళవారం నాడు తూర్పు కారకాస్ ప్రాంతంలో ఆయన మృతదేహం జాతీయ రహదారి మీద పడి కనిపించింది. ఆయన మరణానికి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సంతాపం తెలిపారు. వెనిజువెలాలో ఇటీవలి కాలంలో హింసాత్మక సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు గాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాల్లో సెర్మెనో శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా యువకులను వీధిపోరాటాలకు దూరం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే, సెర్మెనో హత్యకు కారణాలేంటన్న విషయాన్ని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు.