breaking news
Khammam-district
-
గ్రీన్‌ఫీల్డ్.. రయ్రయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం–దేవరపల్లి నేష నల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చింది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 165 కి.మీ మేర నిర్మించిన ఈ రహదారి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద మొదలై ఏపీలోని రాజమండ్రి సమీపాన ఉన్న దేవరపల్లి వద్ద ముగు స్తుంది. 2017లో ఈ ప్రాజెక్టుకు రూ.3,573 కోట్లతో కేంద్రం ద్వారా అనుమతులు మంజూరయ్యాయి. ఈ రహ దారి నిర్మాణంతో ఏపీ వెళ్లే వారికి సుమారు 100 కి.మీ. కలిసి రానుంది. చిన్నచిన్న పనులు మినహా నిర్మా ణం పూర్తవడంతో ఇన్నాళ్లు వైరా మండలం సోమవరం నుంచే అనుమతించిన వాహనా లను ఆగస్టు 1నుంచి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ప్రారంభ స్థానం నుంచి అనుమతిస్తున్నారు. 2017లో రూ.3,573 కోట్లతో...భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం కింద ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో ఉన్న దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల నిడివితో నిర్మించగా, తెలంగాణలో 90 కి.మీ., ఏపీలో 75 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. 2017లో డీపీఆర్ సిద్ధం కాగా, రూ.3,573 కోట్లతో కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. 2018 నాటికే భూసేకరణ పూర్తి చేశారు. ఈ రహదారి నిర్మాణంలో పలు అడ్డంకులు ఎదురైనా ఎట్టకేలకు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తగ్గనున్న ప్రయాణ సమయంఈ హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా సుమారు 56 కి.మీ., సూర్యాపేట నుంచి చూస్తే దాదాపు 100 కి.మీ. దూరం తగ్గుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకోవాలంటే ఆరు గంటల సమయం పట్టేది. కొత్త హైవేతో కేవలం ఐదు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ కారిడార్ ద్వారా ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోల్‌కతా వరకు నేరుగా అనుసంధానం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకతల రహదారిఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్వేగా చెప్పవచ్చు. నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే ప్రవేశం కల్పిస్తూ ప్రతీ 18 కి.మీ.కు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ వసూలుకు ’క్లోజ్డ్ టోలింగ్ సిస్టం’ను అందుబాటులోకి తెచ్చారు. భద్రతా కోణంలో ఐదుచోట్ల అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎంఎస్), ప్రతీ రెండు కి.మీ.కు 360 డిగ్రీల సీసీ కెమెరాలు, సోలార్ దీపాలు, ప్రతీ ఐదు కి.మీ.కు ఒక ఎమర్జెన్సీ ఓపెనింగ్లు ఏర్పాటు చేశారు. అతివేగం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను ఏఐ కెమెరాల ద్వారా గుర్తించి నేరుగా చలాన్లు జారీ చేస్తారు. ప్రతీ 50 కిలోమీటర్లకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్‌రూమ్‌ల వంటి సదుపాయాలు కల్పించే పనులు మొదలయ్యాయి. క్యూఆర్ కోడ్ ద్వారా సమీప పోలీస్‌స్టేషన్, పెట్రోల్ బంక్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ హైవేపై గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది.గ్రీన్‌ఫీల్డ్ హైవే వివరాలుఖమ్మం నుంచి దేవరపల్లి వరకు దూరం 165 కి.మీ.తెలంగాణలో నిడివి 90 కి.మీ.ఆంధ్రప్రదేశ్‌లో నిడివి 75 కి.మీ.మొత్తం వ్యయం రూ. 3,573 కోట్లు -
ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రి పట్టివేత
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో భారీగా పేలుడు సామగ్రిని పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని మావోయిస్టులకు చేరవేస్తున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంకర లోడ్ టిప్పర్ అడుగు భాగంలో పేలుడు సామగ్రిని ఉంచి పాల్వంచ నుంచి మల్కన్‌గిరికి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.92 ల క్షలు ఉంటుందని, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని కొత్తగూడెం ఓఎస్డి జూవెల్ డేవిస్ వివరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిలిటెన్ స్టిక్స్ అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులకు గత 21న సమాచారం అందిందని, ఎంపీ బంజరు సమీపంలో మాటువేసి పట్టుకున్నామని చెప్పారు. 362 జిలిటెన్ స్టిక్స్, 12 బండిళ్ల డిటోనేటర్లు, (ఒక్కో బండిల్లో 25 చొప్పున) స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ శంకర్ నారాయణ, క్లీనర్ సంతోష్ విశ్వకర్మను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా పాల్వంచ మండలం జగన్నాధపురం ప్రభావతి స్టోన్ క్రషర్స్ సూపర్ వైజర్ బండారి వీరన్న టిప్పర్‌లో ఎక్కించాడని తె లిపారని వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన బొల్లం నాగేశ్వరరావు సరఫరా చేశాడని చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పాల్వంచ టు మల్కన్‌గిరి... పాల్వంచకు చెందిన అమర్‌కుమార్ ఒడిశాలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి మావోయిస్టులతో సంబంధాలు ఏర్పడటంతో వారికి పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు మల్కన్ గిరికి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఓఎస్డీ తెలిపారు. అమర్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.


