న్యూజిలాండ్‌లో భూకంపం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని కెర్మడెక్ దీవుల్లో బుధవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. రావుల్ దీవులకు ఈశాన్యంగా 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని వెల్లడించింది.