breaking news
Kejriwal BJP
-
అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్ కౌంటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంపై విమర్శలు గుప్పిస్తూ ప్రముఖ గాంధేయవాది, ఉద్యమకారుడు అన్నా హజారే బహిరంగ లేఖ రాయటంపై కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ గురిపెడుతోందన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే.. సీబీఐ మాత్రం ఎలాంటి స్కాం జరగలేదని నిరూపించిందన్నారు. ‘లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే.. సీబీఐ ఎలాంటి కుంభకోణం జరగలేదని తేల్చింది. వారి మాటలను ప్రజలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ ఎక్కుపెడుతోంది. అన్నా హజారేను బీజేపీ ఉపయోగించినట్లు ప్రముఖ వ్యక్తులను ఉపయోగించటం రాజకీయాల్లో సాధారణమే.’ అని ఆరోపించారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంపై వివాదం తలెత్తిన క్రమంలో తన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు అన్నాహజారే. ముఖ్యమంత్రి అయ్యాక అధికారం అనే మత్తుతో విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదని, అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో చిక్కుకున్నారని దుయ్యబట్టారు అన్నా హజారే. ఇదీ చదవండి: అధికారంతో విషమెక్కావ్.. ఆదర్శాలను తుంగలో తొక్కావ్!.. ఆప్ సర్కార్‌పై అన్నా హజారే ఆగ్రహం -
ఢిల్లీ ప్రజల విలక్షణ తీర్పు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరిచ్చిన తీర్పు విలక్షణమైనదీ.. సలక్షణమైనదీనూ.. భారతీయ ఓటరు సరైన సమయంలో స్పష్టమైన తీర్పునిచ్చి తానెంత విజ్ఞతతో వ్యవహరించగలడో తెలియజేశాడు. ఈ ఎన్నికల ఫలితం ఢిల్లీ పరిధి దాటి దేశం పైనే ప్రభావం చూపగలదు. చిన్నవాడిని, తప్పటడుగులేశాను, లెంపలేసుకున్నాను. మళ్లీ తప్పు చేయను అని నిజాయితీగా ముందుకొచ్చిన కేజ్రీవాల్‌కి అఖండ మెజారిటీ ఇవ్వటం ఢిల్లీవాసులు తీసుకున్న సముచిత నిర్ణయం. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మూడు స్థానాలకే పరిమితమవ్వడం పరిశీలకుల అంచనాకు కూడా అందలేదు. దశాబ్దాలుగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ డకౌట్ అవ్వడం ఆ పార్టీకి చరిత్రాత్మక అవమానం. అవినీతి, ఆశ్రీత పక్షపాతం కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి. అహంకారం, అంతఃకలహాలు బీజేపీకి చావు తప్పి కన్నుపోయే పరిస్థితిని తీసుకువచ్చాయి. పరిమితికి మించిన వేగం ప్రమాదకరమని, అభివృద్ధి పేరుతో అసంఖ్యాక ప్రజానీకాన్ని, వారి సంక్షేమాన్ని విస్మరించడం కుదరదని ఓటరు మహాశయులు మోదీని హెచ్చరించారు. చేసిన అవినీతి, అవకతవకల పాలనను ఇప్పుడిప్పుడే మర్చిపోలేమని కాంగ్రెస్‌కు ఓటర్లు బుద్ధి చెప్పిన తీరు నుంచి ఆ రెండు జాతీయ పార్టీల వారు పాఠాలు నేర్చుకోవాలి. అలాగే కేజ్రీవాల్ మీద అనేక ఆశలతో ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసి ఘనవిజయం కట్టబెట్టారు. ఈ తిరుగులేని మెజారిటీని చూసుకుని ఆయన కర్తవ్యాన్ని మరచిపోరాదు. గతంలో జరిగిన తప్పులను ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం కానీయరాదు. సామాన్యుడు కేంద్రంగా నిజాయితీ రాజకీయాలకు ఇదే నాంది కావాలి. -డా. డి.వి.జి. శంకరరావు మాజీ ఎం.పి., పార్వతీపురం, విజయనగరం