breaking news
katamaraidu
-
మిస్టర్ బచ్చన్ పాండే
నాన్చాక్ పట్టుకుని ‘నేను రెడీ’ అంటున్నారు బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ నటించనున్న తాజా చిత్రానికి ‘బచ్చన్ పాండే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని అక్షయ్ లుక్‌తో పాటు సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’కి (తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయ్యింది) హిందీ రీమేక్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ సినిమాలతో బిజీగా ఉన్నారు అక్షయ్. అలాగే ఆయన నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
కాటమరాయుడు మోషన్ పోస్టర్ విడుదల
సమ్మర్ సీజన్ కోసం శరవేగంగా సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా మోషన పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. హీరో పవన్‌తో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ ఇద్దరూ కలిసి దీపాలు పెడుతున్నట్లుగా ఉన్న ఈ 20 సెకన్ల పోస్టర్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు. శివబాలాజీ, అజయ్, అలీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. గతంలో 'గోపాల... గోపాల'తో పవన్ కల్యాణ్ మనసు చూరగొన్న దర్శకుడు కిశోర్ పార్థసాని (డాలీ) కూడా తనపై నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనువైన సొంత టీమ్‌తో చకచకా షూటింగ్ చేస్తున్నారు. హిట్ సినిమా కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, పూర్తిగా తెలుగు వాతావరణం, పాత్రలతో తయారవుతున్న 'కాటమరాయుడు' వార్తలను బట్టి చూస్తే, వచ్చే వేసవిలో విడుదలయ్యేలాగే ఉంది. -
కాటమరాయుడు మోషన్ పోస్టర్ విడుదల