breaking news
Kasthoori Raja
-
'రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదు'
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ నుంచి డబ్బు గుంజాలని తానెప్పుడూ ప్రయత్నించలేదని ఫైనాన్సియర్ బొర్రా ముకుల్చంద్ వెల్లడించారు. ఫైనాన్సియర్ ....నటుడు, ధనుష్ తండ్రి దర్శక నిర్మాత కస్తూరిరాజాపై చెక్కు మోసం కేసులో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ పేరు చెప్పి అప్పు తీసుకుని మోసం చేసినట్లు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంపై నటుడు రజనీకాంత్ బొర్రాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో బొర్రా తన పరువుకు భంగం కలిగించే విధంగాను, తననుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పిటీషన్లో తన పేరును పేర్కొనట్లు తెలిపారు. ఈ విషయం ఫైనాన్షియర్ బొర్రా నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తానెప్పుడూ రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదని, ఆయన పేరును ఉపయోగించి దర్శకుడు కస్తూరిరాజా అప్పు తీసుకుని మోసం చేశారని మాత్రమే అన్నానని తెలిపారు. తాను డబ్బు తిరిగి చెల్లించలేదంటే రజనీకాంత్ ఇస్తారని కస్తూరిరాజా అన్నారని చెప్పారు. రజనీకాంత్ తన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని బొర్రా హెచ్చరించారు. -
డబ్బు గుంజడానికే దావా: రజనీకాంత్
చెన్నై: తనను అప్రదిష్ట పాల్జేసేందుకే ఫైనాన్సియర్ ముకుంద్ బోత్రా దావా చేశారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. తన వియ్యంకుడు (అల్లుడు తండ్రి) కస్తూరి రాజా తీసుకున్న రూ.65 లక్షల రుణానికి తాను హామీదారుగా లేనని ఆయన స్పష్టం చేశారు. తనను అపఖ్యాతి పాలుచేయడానికి, డబ్బు గుంజడానికే ముకుంద్ బోత్రా దావా వేశారని పేర్కొన్నారు. జూన్ 22న మద్రాస్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు రజనీకాంత్ బుధవారం సమాధానం ఇచ్చారు. కస్తూరి రాజా 2012లో 'మై హూ రజనీకాంత్' అనే హిందీ సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ. 40 లక్షలు రుణం తీసుకున్నారని, ఆ తర్వాత మరో రూ. 25 లక్షలు రుణం అడిగారని.. ఆ రుణం తాను చెల్లించలేకపోతే తన కుమారుడు ధనుష్ మామ అయిన రజనీకాంత్ చెల్లిస్తారని తనకు హామీ ఇచ్చారని ఫైనాన్సియర్ ముకుంద్ బోత్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు.